ప్రధాని మోదీ పేరిట నకిలీ ట్రస్ట్.. పదిమంది నిందితుల అరెస్ట్

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరిట నకిలీ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్న బోగస్ ట్రస్ట్ వ్యవహారం గుట్టురట్టైంది. ప్రధాని మోదీ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులను కోరిన వారిని వారణాసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాని మోదీ పేరిట నకిలీ ట్రస్ట్.. పదిమంది నిందితుల అరెస్ట్
Balaraju Goud

|

Oct 31, 2020 | 11:02 AM

దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరిట నకిలీ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్న బోగస్ ట్రస్ట్ వ్యవహారం గుట్టురట్టైంది. ప్రధాని మోదీ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులను కోరిన వారిని వారణాసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలోని కబీర్ నగర్ ప్రాంతంలో అజయ్ పాండేతోపాటు 10 మంది ఆదర్శు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ జంకల్యాంకరి ట్రస్ట్ ను రిజిస్టరు చేయించారు. ఈ ట్రస్టులో సభ్యులుగా ప్రదీప్ కుమార్ సింగ్, సోను కుమార్ గుప్తా, వికాస్ మిశ్రా, ప్రియా శ్రీవాస్తవ, అనిల్, రంజిత సింగ్, షాబాజ్ ఖాన్, బల్లియాకు చెందిన అవినాష్ సింగ్ రవీంద్రనాథ్ పాండేలు ఉన్నారు.

ఆదర్సు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని వారణాసిలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, 190 బిగాల భూమిని కేటాయించాలని పాండే ఏకంగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కు లేఖ రాశారు. అటు ప్రజా ప్రతినిధుల నుంచి ట్రస్ట్ నిర్వహణకు భారీగా నిధులు సేకరణకు ఫ్లాన్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ లేఖపై ట్రస్టీగా పాండే సంతకం చేసినట్లు గుర్తించారు. యూనివర్శిటీ స్థాపన కోసం స్థలం, నిధులు కేటాయించాలని కోరారు. ఈ ట్రస్టు మోసంపై ఐపీసీ సెక్షన్ 420, 467, 468,471 లప్రకారం కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోదీ విశ్వవిద్యాలయం కోసం నిధులు సమకూర్చాలని పాండే ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేఖలు రాశారని పోలీసులు చెప్పారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu