AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తుఫాన్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..!

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణ వైపు దూసుకొస్తున్న ఆర్నబ్ తుఫాన్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Telangana Weather Alert
Balaraju Goud
|

Updated on: Oct 28, 2026 | 5:31 PM

Share

హైదరాబాద్: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్ష సూచన ఉంది. అలాగే ములుగు, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్లలోపు వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి.

తుఫాన్ ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు

మరోవైపు, తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోనూ రానున్న గంటల్లో వర్షాల తీవ్రత, గాలుల వేగంలో మార్పులు ఉండే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. రైతులు, ప్రయాణికులు వాతావరణ తాజా సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us