AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG SSC Exams 2027: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు చెల్లింపులు ప్రారంభం!

రాష్ట్రంలో 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. సాధారణ ఫీజు రూ.125 చెల్లించేందుకు నవంబర్ 16 వరకు గడువు ఉంది. ఆ తర్వాత రూ.50, రూ.200, రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆదాయ పరిమితుల ఆధారంగా ఫీజు మినహాయింపు లభిస్తుంది..

TG SSC Exams 2027: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు చెల్లింపులు ప్రారంభం!
TG SSC Exams fee schedule
Srilakshmi C
|

Updated on: Oct 28, 2026 | 3:10 PM

Share

హైదరబాద్, అక్టోబర్ 28: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమళ్ల లింగయ్య వివరణాత్మక షెడ్యూల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. సాధారణ ఫీజు చెల్లించేందుకు నవంబర్ 16 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

పదో తరగతి పరీక్ష ఫీజు తేదీలు, ఆలస్య రుసుము వివరాలు ఇవే..

  • అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు: రూ.125 సాధారణ పరీక్ష ఫీజు (ఆలస్య రుసుము లేకుండా)
  • నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు: రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు
  • డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు: రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు
  • డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు

విద్యార్థులు సాధారణ ఫీజుతోనే పరీక్షకు హాజరయ్యే అవకాశం పొందాలంటే నవంబర్ 16లోగా ఫీజు చెల్లించాలి. ఆ గడువు దాటిన తర్వాత అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నిర్దేశించిన కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే ఇందుకు సంబంధిత ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని (Income Certificate) సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్ధుల కుటుంబ ఆదాయ పరిమితులు పట్టణ ప్రాంతాల విద్యార్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.24,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులైతే కుటుంబ వార్షిక ఆదాయం రూ.20,000 లోపు ఉండాలి. అర్హత కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను పాఠశాల అధికారులకు అందజేసి ఫీజు మినహాయింపు పొందవచ్చు.

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMలు) పూర్తి చేయాలి. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారిక వెబ్‌సైట్‌లో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అయి ఫీజు చెల్లింపులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ పరీక్ష ఫీజు వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి తెలుసుకోవాలి. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి, పరీక్షలకు సంబంధించిన ఇతర సూచనలను కూడా పాటించాలి. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు అక్టోబర్ 30న ప్రారంభమవుతాయి. సాధారణ ఫీజుతో చెల్లించేందుకు నవంబర్ 16 చివరి తేదీ కాగా, రూ.500 ఆలస్య రుసుముతో చెల్లించేందుకు డిసెంబర్ 28 వరకు గడువు ఉంది.

Follow Us
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు షురూ
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. అక్టోబర్ 30 నుంచే పరీక్ష ఫీజు షురూ
దీపావళి లక్ష్మీ పూజలో పసుపు గవ్వలు, గోమతి చక్రం ఎందుకు ఉంచుతారు?
దీపావళి లక్ష్మీ పూజలో పసుపు గవ్వలు, గోమతి చక్రం ఎందుకు ఉంచుతారు?
వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో..
వాటర్ గ్లాసుల ముసుగులో ఇంత జరుగుతుందా..? అధికారులు తనిఖీల్లో..
లండన్‏లో చదువు మానేసి మరీ నాకోసం వచ్చాడు.. జాన్వీ కపూర్
లండన్‏లో చదువు మానేసి మరీ నాకోసం వచ్చాడు.. జాన్వీ కపూర్
అర్నబ్ తుఫాన్‌పై సీఎం యాక్షన్ ప్లాన్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫాన్‌పై సీఎం యాక్షన్ ప్లాన్.. కీలక ఆదేశాలు..!
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..
పార్వతీ దేవిని అపర్ణ అని ఎందుకు పిలుస్తారు? కర్వా చౌత్‌తో..
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రాజమౌళి సినిమా..
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
రూ.20 కచోరీ మోజులో రూ.20 లక్షలు మాయం..!
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
ఇదేం వ్యాపారం రా బాబు.. హైదరాబాద్‌ రియలెస్టేట్‌లో కొత్త విధానం
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!
పిడికిలి బిగించే విధానమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది!