భారత్ బంద్‌లో తెలంగాణ మంత్రులు…జిల్లాల్లో ఎమ్మెల్యేలు.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు నిరసనలు..
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని బూర్గుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై రైతులతో కలసి ధర్నాలో పాల్గొంటారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ వై జంక్షన్ వద్ద నాగ్‌పూర్ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇక మంత్రులు, శాసనసభ్యులు జిల్లాల్లో పాల్గొననున్నారు. వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న భారత్ బంద్‌కు సంఘీభావంగా పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు మంగళవారం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూరు, ఎర్రబెల్లి దయాకర్‌రావు మడికొండ, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు.