తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.!

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.!

రాష్ట్రంలో మరో కొత్తరకం వ్యాధి బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అచ్చం పచ్చ కామెర్ల తరహాలో ఉండే ఈ వ్యాధి పేరు 'లెప్టోస్పీరోసీస్'.

Ravi Kiran

|

Aug 13, 2020 | 1:44 AM

Leptospirosis Case Reported In Adilabad: ఒకవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంటే.. మరోవైపు సీజనల్, వైరల్ జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది. ఈ రెండిటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రంలో మరో కొత్తరకం వ్యాధి బయటపడింది. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అచ్చం పచ్చ కామెర్ల తరహాలో ఉండే ఈ వ్యాధి పేరు ‘లెప్టోస్పీరోసీస్’. ఈ వ్యాధికి సంబంధించి నాలుగు కేసులను గతేడాది కూడా గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు.

ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, ఇతర జంతువుల మూత్రం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి వంటివి కనిపిస్తాయన్నారు. సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని.. లేదంటే కిడ్నీలు, లివర్‌పై ప్రభావం చూపుతుందని డాక్టర్లు తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో తగ్గిన కంటైన్మెంట్ జోన్లు.. తాజా లిస్టు ఇదే.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu