తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడంటే.?
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రంగం సిద్దం చేస్తోంది. ఇటీవలే విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం మరోసారి రిజల్ట్స్ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. నేడు ఫలితాలపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. దీనితో రేపు లేదా ఎల్లుండి ఫలితాలను విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. మొదట, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్‌ను ఒకేసారి విడుదల చేస్తారని సమాచారం. ఇకపోతే, గతేడాది ఇంటర్ ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ పేపర్ల కౌంటింగ్, విడుదలపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఏపీలో కొద్దిరోజుల క్రితమే ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.
Also Read: