బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, విద్యాసంస్థలు బంద్..

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశం ముగిసింది.  మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు తెలంగాణలో థియేటర్స్, విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్టు వెల్లడించారు. షాపింగ్ మాల్స్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న పరీక్షలు మాత్రం యధావిధిగా జరపాలని సీఎం అధ్యక్షతన సమావేశమైన హైలెవల్ కమిటీ తీర్మానించింది. శాసనసభ సమావేశాలు రేపు, ఎల్లుండి జరగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 20వరకు సమావేశాల షెడ్యూల్ […]

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, విద్యాసంస్థలు బంద్..
Follow us

|

Updated on: Mar 14, 2020 | 4:56 PM

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన హైలెవల్ కమిటీ సమావేశం ముగిసింది.  మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో సర్కార్  కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు తెలంగాణలో థియేటర్స్, విద్యాసంస్థలు బంద్ చేస్తున్నట్టు వెల్లడించారు. షాపింగ్ మాల్స్‌పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న పరీక్షలు మాత్రం యధావిధిగా జరపాలని సీఎం అధ్యక్షతన సమావేశమైన హైలెవల్ కమిటీ తీర్మానించింది. శాసనసభ సమావేశాలు రేపు, ఎల్లుండి జరగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 20వరకు సమావేశాల షెడ్యూల్ ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి నిర్వహించి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.  కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా ఇప్పటికే బీహార్, గోవా, పశ్చిమ బెంగాల్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, థియేటర్స్, విద్యా సంస్థలు మూతపడ్డాయి.