AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్కుక్ గ్రామ సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్

గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్‌ కాల్ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతోంది. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో […]

మర్కుక్ గ్రామ సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 9:06 PM

Share

గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్‌ కాల్ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతోంది. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కొండపోచమ్మ సాగర్ కి గోదావరి జలాలు చేరడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యినట్లే. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్‌ పంప్‌హౌజ్‌ చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్‌ పంప్‌హౌ్‌సలో మోటార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!