Telangana Budget: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు.. అసెంబ్లీలో మంత్రి జగదీశ్‌రెడ్డి క్లారిటీ
Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు..
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాంప్రదాయేతర ఇంధన వనరులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో సౌరవిద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. 2017 -18 నాటికి 3,600 మెగావాట్లు, 2018-19 నాటికి 3,894 మెగావాట్లు, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.
సాంప్రదాయేతర ఇంధన రంగంలో గతంలో 72 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరిగితే.. ప్రస్తుతం 4200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. రాబోయే రెండేళ్లకు దాదాపు 3 వేల మెగావాట్ల ఉత్పత్తికి వివిధ సంస్థలకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ర్టంలో రాబోయే అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందన్నారు. కేవలం తెలంగాణలో 13 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. మరో వెయ్యి మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. విద్యుత్‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
Read More:
Telangana Budget: పెన్షన్లపై కేంద్రానివన్నీ దొంగ లెక్కలే.. అసెంబ్లీలో మంత్రి ఎర్రబెల్లి నిప్పులు
Uttarakhand CM: భారత్‌ను అమెరికా పాలించిందా..? మా సిలబస్‌లో లేదే ఇదీ.. సీఎంపై నెటిజన్ల సెటైర్స్