MLA Volleyball: మొన్న గొర్రెల కాపరి.. నేడు వాలీబాల్‌ ప్లేయర్‌.. స్ట్రైక్‌లు లిఫ్టులతో అదరగొట్టిన ఏపీ ఎమ్మెల్యే

YCP MLA: మొన్న తలపాగా చుట్టి, దుడ్డుకర్ర చేతబట్టి రోడ్డుపై గోర్రెలు కాసిన ఆ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అదే ఎమ్మెల్యే నేడు గ్రౌండ్‌లో వాలిబాల్‌ ప్లేయర్‌గా మారి లిఫ్టులు, స్ట్రైక్‌లతో..

MLA Volleyball: మొన్న గొర్రెల కాపరి.. నేడు వాలీబాల్‌ ప్లేయర్‌.. స్ట్రైక్‌లు లిఫ్టులతో అదరగొట్టిన ఏపీ ఎమ్మెల్యే
Mla Sridevi
Follow us
K Sammaiah

|

Updated on: Mar 22, 2021 | 10:22 AM

మొన్న తలపాగా చుట్టి, దుడ్డుకర్ర చేతబట్టి రోడ్డుపై గోర్రెలు కాసిన ఆ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అదే ఎమ్మెల్యే నేడు గ్రౌండ్‌లో వాలిబాల్‌ ప్లేయర్‌గా మారి లిఫ్టులు, స్ట్రైక్‌లతో అదరగొట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విలక్షణ శైలితో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ కార్యకర్తలకు, అభిమానులకు చేరువ అవుతూ ఉంటారు. అందుకే ఆమె ఏం చేసినా సంచలనంగా మారతూ ఉంటుంది. మొన్న రోడ్డుపై గొర్రెలు కాసిన ఎమ్మెల్యే శ్రీదేవి తాజాగా ప్లేయర్ అవతారం ఎత్తారు. అది కూడా వాలీబాల్ ప్లేయర్ గా మారారు. జస్ట్ బాల్ పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాదు.. అక్కడ ఉన్న యువకులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి సందడి చేశారు.

తన క్యాంపు కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో పలకలూరు గ్రామంలో యువకులు వాలీబాల్ ఆడుతుండడం గమనించింది ఉండవల్లి శ్రేదేదవి. ఇంకేముంది తాను కూడా వాలీబాల్ ఆడాలి అనుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కారు నుంచి కిందకు దిగారు. వాలీబాల్ కోర్టులోకి అడుగుపెట్టి స్ట్రయికింగ్ చేశారు. బాల్ లిఫ్ట్ చేయడంతో సహా.. సర్వీస్ కూడా సూపర్ గా చేశారు. ఆ పిల్లలతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడి.. అందర్నీ ఉత్సాహ పరిచారు. స్వయంగా ఎమ్మెల్యే అయి ఉండి వాలీబాల్ ఆడుతుండడంతో అటువైపు వెళ్తున్నవారంతా అక్కడ ఆగి కాసేపు ఆమె ఆటను చూసి ఆశ్చర్యపోయారు. అది కూడా చీరకట్టుతో ఉన్న ఆమె వాలీబాల్ ఆడడం అందర్నీ షాక్ కు గురి చేసింది. ఎమ్మెల్యే ఏంటి వాలీబాల్ ఆడుతున్నారు అనుకుంటూ అక్కడే ఆగిపోయారు.

పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడటం ఏంతో ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. తన చిన్న తనంలో తోటి స్నేహితులతో కలిసి ఆటలు ఆడిన సంగతి గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్ళీ పిల్లలతో కలిసి ఆడటం ఏంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు, యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఎమ్మెల్యే శ్రీదేవి అభిప్రాయపడ్డారు. తాజాగా వాలీబాల్ ఆడుతూ సందడి చేసిన ఆమె.. ఇటీవల కాపరిగా మారి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో రోడ్డుపై భారీగా మేకలు కనిపించాయి. వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే శ్రీదేవి.. తలపాగా కట్టి చేత కర్రబట్టి.. కాసేపు మేకల కాపరిగా మారిపోయారు. అచ్చెం గొర్రెల కాపరిలా వాటి వెంట ఆమె నడిచారు. దీంతో అటుగా వెళుతున్న ప్రయాణికులు ఎమ్మెల్యే శ్రీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే ఏంటి మేకలు కాయడం ఏంటని నివ్వెరపోయారు.

Read More:

Corona Lock down: జనతా కర్ఫ్యూకి ఏడాది పూర్తి.. మరోసారి విజృంభిస్తోన్న మహమ్మారి

CM KCR Review: పాలమూరు ప్రాజెక్టులపై ప్రగతిభవన్‌ ఫోకస్‌.. ఇరిగేషన్‌ అధికారులకు కీలక ఆదేశాలు

MLC Elections Results: పటాకులు కాల్చి.. మిఠాయిలు పంచి.. టీఆర్‌ఎస్‌ గెలుపుపై శ్రేణుల సంబరాలు