వ్యవసాయశాఖలో ఈ-కార్యాలయం
Department of Agriculture Implementing e-Office : కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలతో ఆ శాఖ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి ఈ-కార్యాలయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-కార్యాలయం సామర్ధ్యం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు. సమయం కూడా కలిసి వస్తుందని అభిప్రాయ పడ్డారు. పనుల్లోనాణ్యత, సమర్ధవంతమైన వనరుల నిర్వహణ, పారదర్వకత, జవాబుదారీతనం […]

Department of Agriculture Implementing e-Office : కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలతో ఆ శాఖ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి ఈ-కార్యాలయాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-కార్యాలయం సామర్ధ్యం ద్వారా అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందని అన్నారు.
సమయం కూడా కలిసి వస్తుందని అభిప్రాయ పడ్డారు. పనుల్లోనాణ్యత, సమర్ధవంతమైన వనరుల నిర్వహణ, పారదర్వకత, జవాబుదారీతనం వంటివి పెరుగుతాయని అన్నారు. ఇక పౌరులకు మరింత నాణ్యమైన సేవలు అందించడానికి కూడా ఈ-ఆఫీస్ కృషి చేస్తుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆగస్టు నెలను ఈ-ఆఫీస్ నెలగా జరుపుకోవాలని కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.




