గ్రేటర్ పరిధిలో లక్ష గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ పరిధిలో లక్ష గణేష్ మట్టి విగ్రహాలను

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొర్పొరేషన్ పరిధిలో లక్ష గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సంతోష్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేటర్లకు మంత్రి బుధవారం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రజలు తమ ఇళ్లలోనే పండుగను చేసుకోవాల్సిందిగా మంత్రి కోరారు. 11వ రోజు ఉత్సవాన్ని సాంప్రదాయం ప్రకారం గణేష్ ఆలయాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రభుత్వమే బోనాలు, వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read More:
ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్ ఐసోలేషన్..!



