ఇది ఆటవిక న్యాయం.. కానీ కరెక్టేః తనికెళ్ళ భరణి
వెటర్నరీ డాక్టర్ దిశ కేసులోని నిందితులను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం వారిని హతమార్చారని తెలుస్తోంది. దిశ కేసులోని నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై సీనియర్ నటుడు, రచయిత తణికెళ్లభరణి స్పందించారు… ‘ఒక మహిళను ఎత్తుకెళ్ళిపోయినందుకు రామాయణం జరిగింది.. అలాగే ఒక స్త్రీని అవమానించినందుకు మహాభారతం […]
వెటర్నరీ డాక్టర్ దిశ కేసులోని నిందితులను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. సీన్ రీ- కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణ కోసం వారిని హతమార్చారని తెలుస్తోంది. దిశ కేసులోని నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై సీనియర్ నటుడు, రచయిత తణికెళ్లభరణి స్పందించారు…
‘ఒక మహిళను ఎత్తుకెళ్ళిపోయినందుకు రామాయణం జరిగింది.. అలాగే ఒక స్త్రీని అవమానించినందుకు మహాభారతం జరిగింది .. ఇక ఇవాళ ఒక ‘దిశ’ నిర్దేశం జరిగింది. డాక్టర్ దిశను తలుచుకుంటేనే ఆవేదన వస్తోంది.. అసలు ఇలా జరగకూడదు. ఇది ఆటవిక న్యాయం. కానీ ఇలాంటి సమాజంలో పశువులు ఉన్న చోట ఆటవిక న్యాయమే కరెక్ట్ ఏమో.. ఇప్పటికైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుతుంది. పోలీసులకు నమస్కారాలు తెలియజేస్తున్నా’ అని ఓ వీడియో ద్వారా తన మనసులోని బాధను తనికెళ్ళ భరణి పంచుకున్నారు.