నిర్భయ ఆత్మకి శాంతి ఎప్పుడు? ముప్పూటలా తిండిపెట్టి మేపుతున్నారు..!

నిర్భయ ఆత్మకి శాంతి ఎప్పుడు? ముప్పూటలా తిండిపెట్టి మేపుతున్నారు..!

ఈ రోజు పొద్దున్న జరిగిన సంఘటన గురించి.. దేశవ్యాప్తంగా.. అందరూ.. స్వీట్లు పంచుకోని.. సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులకు రాఖీలు కట్టడాలు చూస్తుంటే.. మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోంది. ఆ మృగాళ్లకు సరైన శిక్ష పడింది. అయితే.. ఇది నిజమైన జస్టిస్‌గా నేను భావించడం లేదని.. ఎన్‌కౌంటర్ జరిగిన దానికి 100 పర్సెంట్‌కి.. 1000 శాతం నేను సంతోషంగా ఉన్నాను. అయితే.. ఇలా కాకుండా.. లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యి ఉంటే.. ఇంకా బాగుండేదని నాకు అనిపించిందని.. అప్పుడు.. ఇంకొకరు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Dec 06, 2019 | 3:57 PM

ఈ రోజు పొద్దున్న జరిగిన సంఘటన గురించి.. దేశవ్యాప్తంగా.. అందరూ.. స్వీట్లు పంచుకోని.. సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులకు రాఖీలు కట్టడాలు చూస్తుంటే.. మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోంది. ఆ మృగాళ్లకు సరైన శిక్ష పడింది. అయితే.. ఇది నిజమైన జస్టిస్‌గా నేను భావించడం లేదని.. ఎన్‌కౌంటర్ జరిగిన దానికి 100 పర్సెంట్‌కి.. 1000 శాతం నేను సంతోషంగా ఉన్నాను. అయితే.. ఇలా కాకుండా.. లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యి ఉంటే.. ఇంకా బాగుండేదని నాకు అనిపించిందని.. అప్పుడు.. ఇంకొకరు తప్పు చేయాలన్నా భయపడతారని.. మంచు లక్ష్మీ అన్నారు.

ఎన్‌కౌంటర్ చేసినందుకు ఒక వైపు ఆనందంగా ఉన్నా.. ఇలా ఎంతమందినని ఎన్‌కౌంటర్ చేసుకుంటూ పోతారు..? తప్పు చేసినట్టు రుజువైతే.. వారికి ఉరి శిక్ష పడేలా.. కఠిన శిక్షలు తీసుకురావాలని లక్ష్మీ పేర్కొన్నారు. వీళ్లు నలుగురు చనిపోయినందుకు సంతోషం కాకుండా.. మిగతా వారికి కూడా శిక్షపడేలా.. డిమాండ్ చేయాలని చూడాలన్నారు. ఫెండ్ల్రీ పోలీసింగ్ పెరగాలి. చట్టాలు మారాలి.. ఆ మార్పులు వస్తాయంటే.. ఇండస్ట్రీని మొత్తం బయటకు తెస్తానని ఆమె అన్నారు.

నిర్భయను ఆమెను రాడ్డుతో.. హత్య చేసిన.. రాబర్ట్ అనే వాడు.. స్వేచ్ఛగా మన దేశంలో తిరుగుతున్నాడు. అదేమి జస్టిసో నాకు అర్థం కావడం లేదు. నిర్భయ హత్యాచారం జరిగి ఏడు సంవత్సరాలు కావస్తోన్నా.. వాళ్లను జైల్లో పెట్టి.. ముడు పూటలా.. భోజనం పెట్టి.. మా ట్యాక్స్ డబ్బులతో.. వారిని సపరేట్‌గా ఉంచుతున్నారని.. చూసుకోవడానికి పోలీసులు రెండుసార్లు షిఫ్టులు మారుతున్నారని సమాచారం అందింది. అలా చేయడానికి కారణం ఏంటి..? నిర్భయ ఆత్మకి శాంతి ఎప్పుడు చేకూరుతుందని మంచు లక్ష్మీ డిమాండ్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu