Funerals: ఆపద సమయంలో ఆపన్న హస్తం.. మహాసేవ పేరుతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు… జేజేలు పలుకుతున్న జనం

కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు రక్త సంబంధీకుల సైతం అమడ దూరంగా ఉంటున్నారు. దహన సంస్కారాలకు మేమున్నామంటూ ముందుకు వస్తోంది తాండూరు యువత.

Funerals: ఆపద సమయంలో ఆపన్న హస్తం.. మహాసేవ పేరుతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు...  జేజేలు పలుకుతున్న జనం
Funerals For Corona Dead Bodies In Vikarabad District
Follow us

|

Updated on: Apr 29, 2021 | 5:19 PM

Funerals for Corona Dead Bodies: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతోంది. కరోనా అంటేనే ఆమడ దూరం పరుగులు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో పోరాడి మృత్యువు ఒడిలో ఒదిగిన వారి అంతిమ సంస్కారాలకు రక్త సంబంధీకుల సైతం అమడ దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రజలు భయంగుపెట్లో పెరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనాతో చనిపోయిన వారిని చివరి చూపు చూసేందుకు కూడా ఆత్మీయులు దగ్గరకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయట వ్యక్తులతో అంత్యక్రియలు చేయించాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కరోనా మృతదేహం కావడంతో కిలోమీటర్ల లెక్కన 20కిలోమీటర్ల దూరానికి కూడా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇక, అంత్యక్రియలకు అయితే ముందుకు వచ్చే వారే కరువు.., ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు రాకపోతేనేం మేము ఉన్నాం అంటోంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మహాసేవ సభ్యులు, తాండూర్ యూత్ వెల్ఫేర్ సభ్యులు. కోవిడ్ తో చనిపోయిన వారు అనాధలు కాదు మా బంధువులు అంటున్నారు.

కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు ముందుకురాని కుటుంబ సభ్యులకు మేమున్నామని అండగా నిలుస్తున్నారు. వీరి సేవకు తాండూరు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఉన్నవారు లేని వారి అని చూడకుండా సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి చనిపోయిన వారికి వారి వారి సంప్రదాయాలను ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

నిన్న అర్ధరాత్రి కోవిడ్ బారినపడి తాండూరు పట్టణానికి చెందిన ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ రవిశంకర్ వారి అమ్మ అంత్యక్రియలను తాండూరు పట్టణానికి చెందిన మహాసేవ వ్యవస్థాపక అధ్యక్షులు గోపాలకృష్ణ, సభ్యులు చంటి యాదవ్ అంకిత్ అనురాగ్, ఎబినేజర్ టైలర్ రమేష్, రఘు గౌడ్‌లు స్థానిక వీరశైవ స్మశానవాటికలో హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. వీరికి వారి కుటుంబ సభ్యుల తరఫున అభినందనలు అందుకున్నారు.

తాజాగా వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ నర్సయ్య గౌడ్ కోవిడ్ బారినపడి కన్నుమూశాడు. అయితే, ఈయన అంత్యక్రియలు నిర్వహించేందుకు గాను వారి కుటుంబ సభ్యులు తాండూరులోని మహాసేవ, తాండూరు యూత్ వెల్ఫేర్ సభ్యులను సంప్రదించగా వారు అక్కడికి వెళ్లి మృతునికి హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తాండూరుకు చెందిన మహాసేవ, యూత్ వెల్ఫేర్ సభ్యుల సేవలు ఎల్లలు దాటి బాధితులకు అండగా నిలిచింది. వీరి మానవ సేవపట్ల పలువురు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read Also….  Corona Crisis: మానసిక బలం.. కరోనా కాలంలో ప్రజలకు ముఖ్య అవసరం అంటున్న ఆరోగ్య నిపుణులు

Latest Articles
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
ప్లే ఆఫ్స్‌లకు వర్షం ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దయితే రిజల్ట్ ఇదే
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
అల్పపీడనం ఎఫెక్ట్... ఏపీకి వర్షసూచన
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైంది
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
ఎన్నికల ఫలితాలకు ముందే.. కొత్త మూవీస్ అప్‌డేట్స్.. ఏంటా సినిమాలు?
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
విమాన ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూపే కార్డుంటే చాలు..
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
రూ.5 వేలకు ఓటు అమ్ముకొన్న మంగళగిరి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.