Corona Crisis: మానసిక బలం.. కరోనా కాలంలో ప్రజలకు ముఖ్య అవసరం అంటున్న ఆరోగ్య నిపుణులు

కరోనా విరుచుకు పడుతున్న వేళలో ప్రజలకు అన్నిటికన్నా కావల్సింది మానసికబలం అని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనాతో వచ్చే శారీరక బాధల వలన వచ్చే ముప్పుకన్నా.. మానసికంగా వచ్చే ఇబ్బందితో వచ్చే ముప్పు చాలా ఎక్కువ

Corona Crisis: మానసిక బలం.. కరోనా కాలంలో ప్రజలకు ముఖ్య అవసరం అంటున్న ఆరోగ్య నిపుణులు
Psitive News In Pandemic
Follow us
KVD Varma

|

Updated on: Apr 29, 2021 | 5:09 PM

Corona Crisis: కరోనా విరుచుకు పడుతున్న వేళలో ప్రజలకు అన్నిటికన్నా కావల్సింది మానసికబలం అని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనాతో వచ్చే శారీరక బాధల వలన వచ్చే ముప్పుకన్నా.. మానసికంగా వచ్చే ఇబ్బందితో వచ్చే ముప్పు చాలా ఎక్కువ అని వారంటున్నారు. ఈ వివరాలను పొందుపరుస్తూ దేశంలోని నలుగురు మానసిక ఆరోగ్య నిపుణులు మీడియాకు ఒక లేఖ రాసారు. ఈ సమయంలో మీడియా బాధ్యతతో కూడిన సానుకూల రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. డాక్టర్ బిఎన్ గంగాధర్, డాక్టర్ ప్రతిమ మూర్తి, డాక్టర్ గౌతమ్ సాహా అలాగే డాక్టర్ రాజేష్ సాగర్ రిపోర్టింగ్ చేసే సమయంలో హిస్టీరియా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు. కరోనా తొ బాధపడతున్న పేషెంట్ ఒంటరిగా ఉన్నపుడు ఇది చాలా ముక్యమైనది అని చెప్పారు. కరోనాతో ఇబ్బంది పడే వారికి వారిని పాజిటివ్ గా ప్రేరేపితుల్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కరోనాతో పడుతున్న కష్టాలు.. దాని వలన జరుగుతున్న మరణాలు వంటి వార్తలు కరోనా రోగుల్ని కుంగుబాటుకు గురిచేసే అవకాశం ఉంటుందని వారన్నారు.

ఇక ఆక్సిజన్ లేకపోవడం, ఆక్సిజన్ దుర్వినియోగం, టీకాల లభ్యత పై ప్రశ్నించడం అలాగే వ్యాక్సిన్ గురించిన పాజిటివ్ వార్తలతో మీడియా ఈ క్లిష్ట సమయంలో చక్కగా వ్యవహరిస్తోందని వారు ప్రశంసించారు.

ప్రజలు సానుకూలంగా ఉండటానికి మీడియా సహాయం చేయాలన్న డాక్టర్లు.. ”మీడియా మరియు ముఖ్యంగా మాస్ మీడియా యొక్క శక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది మహమ్మారి విరుచుకు పడుతున్న సమయంలో పూర్తి శక్తితో అభిరుచితో పనిచేస్తోంది. కానీ, మన మీడియా స్నేహితులతో పంచుకోవాలనుకునే కొన్ని అంశాలు ఉన్నాయి.” అని పేర్కొన్నారు. గ్రూప్ పైర్ బర్నింగ్, రోగుల ఏడుపు మరియు అలాంటి కొన్ని ఫోటోలు లేదా క్లిప్‌లు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారి ఆత్మస్థైర్యం దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పారు. ”ఈ క్లిష్ట సమయంలో, ప్రజలు ఇంటిపట్టునే ఉంటారు. ఆ ఆ సమయంలో టీవీ లేదా సోషల్ మీడియా ద్వారా బయటి పరిస్థితిని తెలుసుకోగలుగుతారు. ఈ దశలో సానుకూలంగా ఉండటానికి మీరు వారికి సహాయపడగలరు. అగౌరవం మరియు అజాగ్రత్త చూపించి, వారి ఆత్మా స్థైర్యం దెబ్బతీయవద్దు.” అని కోరారు.

మూడు పేజీల లేఖలో ఈ మనోరోగ వైద్యులు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ”దుర్వినియోగం మరియు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడం మీడియా బాధ్యత అని చెప్పారు. ఇది కూడా చేయాలి, కాని రిపోర్టింగ్ లేదా కవరేజ్ సమయంలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం మంచిది అని సూచించారు. వ్యాధి సోకి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వారి మనసులను కొన్ని ఫోటోలు, క్లిప్ లు ఇబ్బంది పెడతాయి. ఇకపై ఆరోగ్యంగా ఉండటం కష్టం.. బయటకు వెళితే చికిత్స ఇంకా కష్టం అని వారికి అనిపించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. అందుకోసం మీడియా సహకరించాల్సిన అవసరం ఉందని ఆ నిపుణులు చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిల్లో మీడియాకు ప్రజల్ని మానసికంగా చైతన్యంగా ఉంచగలిగే అవకాశం ఉందని చెప్పిన నిపుణులు ఆ దిశలో పలు కథనాలు.. ఫోటోలు మీడియాలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సానుకూల వార్తలు ప్రజల్లో మంచి ప్రభావాన్ని చూపుతాయన్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న ఈ గడ్డు పరిస్థితుల్లో వారికి చేదోడుగా మీడియా ఉండాలి అని తమ లేఖలో మానసిక ఆరోగ్య నిపుణులు కోరారు.

Also Read: Stop the Spread: ”ఆశావాదం.. మనందరికీ ఒక సార్వత్రిక మతం” ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వీడియో ఆందోళనకర సమయంలో ఆహ్లాదాన్నిస్తోంది!

Photo Viral: ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితుడిని చూసి ఆశ్యర్యపోయిన కలెక్టర్‌.. ఆయన చేసిన పనికి ఫిదా.. ఫోటో వైరల్‌