Stop the Spread: ”ఆశావాదం.. మనందరికీ ఒక సార్వత్రిక మతం” ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వీడియో ఆందోళనకర సమయంలో ఆహ్లాదాన్నిస్తోంది!
ఒక కష్ట సమయంలో ప్రజలకు సానుకూలమైన విషయాలు మానసిక శక్తిని ఇస్తాయి. ఎప్పుడూ కష్ట సమయంలో ఆశావాద దృక్పధంలో మానవులు ఉండే విధంగా తెలిసే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరంగా ఉంటుంది.
Stop the Spread: ఒక కష్ట సమయంలో ప్రజలకు సానుకూలమైన విషయాలు మానసిక శక్తిని ఇస్తాయి. ఎప్పుడూ కష్ట సమయంలో ఆశావాద దృక్పధంలో మానవులు ఉండే విధంగా తెలిసే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరంగా ఉంటుంది. ఇటువంటి ఆశావాద విషయాలు ప్రజల్ని మానసికంగా బలంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. కరోనా విషయంలో గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల విషయాలను ప్రజలు చూశారు. చూస్తున్నారు. వాటన్నిటినీ ఒక దగ్గర ఏర్చి కూర్చి.. మంచి శీర్షికలను జతచేసి చక్కని వీడియోగా అందించింది కోకాకోలా.. ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచేలా ఉన్న ఆ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. కోకాకోలా వెలువరించిన ఈ వీడియోకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.. చక్కని విజువల్స్.. అంతకు మించిన క్యాప్షన్స్ .. ”ప్రతి స్వార్థ పూరిత చర్యకూ.. వేలాది మంది నిస్వార్ధ సేవ ఉంది..” అనే క్యాప్షన్ తో లాక్ డౌన్ సమయంలో దుకాణాలు ఖాళీ అయ్యేలా సామాను కొన్నవారి ఇమేజి చూపిస్తూ వెంటనే.. కోవిడ్ ఆసుపత్రిలో సేవలు చేస్తున్న సిబ్బందిని చూపించారు. ”మూసుకున్న ప్రతి స్కూల్ వెనుకా.. తెరుచుకున్న అనేక కొత్త తరగతి గదులు ఉన్నాయి.” అంటూ మూసిన స్కూళ్ళను చూపిస్తూ వెంటనే..అమ్మ దగ్గరుండి తన చిన్నారికి చదువు చెబుతున్న దృశ్యం జత చేశారు.. ”మొత్తం నిశ్శబ్దం అయిపోయినా.. ప్రకృతి వినిపించిన సంగీతం ఉంది.” అని చెబుతూ లాక్ డౌన్ లో నిర్మానుష్యంగా మారిన ప్రదేశాలను చూపిస్తూ దానికి జతగా ఉదయ వేళల్లో పక్షుల కువకువలు వినిపించారు. ఇలా రెండు నిమిషాల పద్నాలుగు సెకన్ల ఈ వీడియోలో విపత్తులో వికాశం అనే అర్ధం వచ్చేలా అన్నీ సానుకూలాంశాలు పొందుపరిచారు.
ఈ వీడియో గురించి మేము చెప్పేకన్నా మీరూ ఇక్కడ చూడండి.. రెండు నిమిషాల పాటు మానసికంగా ఎంత రిలాక్స్ అవుతారో గమనించండి..
Optimism. A universal religion we can all belong to… Thank you Coca Cola pic.twitter.com/IAen8i4tCl
— anand mahindra (@anandmahindra) April 29, 2021
ఈ వీడియో ఆనంద్ మహీంద్రాకు విపరీతంగా నచ్చింది. సరిగ్గా ఇటువంటి క్లిష్టసమయంలో మనకు కావలసినది ఇదే అని చెప్పిన ఆనంద్.. ఈ వీడియో అందించిన కోకా కొలాను ప్రశంసించారు. “ఆశావాదం. మనమందరం చెందిన ఒక సార్వత్రిక మతం … ధన్యవాదాలు కోకా కోలా” అని ఆనంద్ మహీంద్రా ఈ ప్రకటనను పంచుకుంటూ రాశారు.
ఇక ఈ ట్వీట్ వీడియోపై వచ్చిన కామెంట్లలో కొన్ని..
Nice positive video ??
Need of the present moment to remain resolutely positive and help others ?
— Dr Charuhas (@charuhasmujumd1) April 29, 2021
This made me Cry, Hats off to the composer…Brilliant
— Bagesh (@bageshk) April 29, 2021
Also Read: Hydrated Fruits: వేసవిలో ఈ పండ్లు తింటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు.. అవేంటంటే..?