AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన 82 ఏళ్ళ బామ్మ.. ప్రోనింగ్‌ పొజిషన్‌తో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంపు.. హోం ఐసొలేషన్‌లో కోలుకున్న బామ్మ

 ఉత్తర్‌ప్రదేశ్‌లో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. డాక్టర్ల సలహా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మనోధైర్యం ఆమెను కరోనా జయించేలా చేసాయి. కేవలం 12 రోజులు...

కరోనాను జయించిన 82 ఏళ్ళ బామ్మ.. ప్రోనింగ్‌ పొజిషన్‌తో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పెంపు.. హోం ఐసొలేషన్‌లో కోలుకున్న బామ్మ
82 Years Old Women Recoverd
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2021 | 5:41 PM

Share

ఉత్తర్‌ప్రదేశ్‌లో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. డాక్టర్ల సలహా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మనోధైర్యం ఆమెను కరోనా జయించేలా చేసాయి. కేవలం 12 రోజులు హోం ఐసోలేషన్‌ లో ఉండి కరోనా నుంచి బయటపడింది బామ్మ. వృద్ధురాలికి కరోనా సోకి ఆక్సిజన్‌ లెవల్స్‌ 79కి పడిపోయాయి.ఆందోళన పడ్డ ఆమె కుమారుడు డాక్టర్లను సంపద్రించాడు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగేందుకు ప్రోనింగ్‌ పొజిషన్‌ ప్రాక్టీస్‌ చేయించారు. కేవ‌లం నాలుగు రోజుల్లో ఆక్సిజన్‌ లెవెల్‌ 94కి పెరిగింది. డయాబెటిస్ , అధిక రక్తపోటు స‌మస్య‌లు ఉన్నప్పటికీ ఆమె కోలుకుంది.

క‌రోనా వైర‌స్ సోకిన బాధితులకు ఊపిరి సరిగా అందనప్పుడు బోర్లా ప‌డుకుని శ్వాస పీల్చాలన్నదే ప్రోనింగ్‌. ఆస్ప‌త్రుల‌లో ఊప‌రి ఆడ‌ని క‌రోనా పేషెంట్లకు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుస‌రిస్తున్నారు. రోజులో ఒక సారి 30 నిమిషాల పాటు ప్రోనింగ్ చేయ‌డం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్‌ పెరుగుతాయని డాక్ట‌ర్లు అంటున్నారు. ప్రోనింగ్‌తో మెరుగైన ఫలితాలుంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసింది. కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వేళ కాస్త ఊరట కలిగించే వార్త ఇది.

Also Read:  కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..? టీకాలపై జీఎస్టీ తొలగించే అవకాశం

వ్యాక్సిన్ కోసం ముంబైలో బారులు తీరిన ప్రజలు, ఉసూరుమంటున్న వృద్దులు

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం