వ్యాక్సిన్ కోసం ముంబైలో బారులు తీరిన ప్రజలు, ఉసూరుమంటున్న వృద్దులు

ఇన్నాళ్లూ ఆక్సిజన్ కొరత, హాస్పిటల్స్ లో బెడ్ల కొరత గురించి విన్నాం. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్  కొరత కూడా పీడిస్తోంది. దేశంలోనే అత్యధిక కోవిడ్ కేసులతో మహారాష్ట్ర సతమతమవుతుండగా ముంబై నగరం వ్యాక్సిన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. 

వ్యాక్సిన్ కోసం ముంబైలో  బారులు తీరిన ప్రజలు, ఉసూరుమంటున్న వృద్దులు
Vaccine
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 29, 2021 | 5:29 PM

ఇన్నాళ్లూ ఆక్సిజన్ కొరత, హాస్పిటల్స్ లో బెడ్ల కొరత గురించి విన్నాం. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్  కొరత కూడా పీడిస్తోంది. దేశంలోనే అత్యధిక కోవిడ్ కేసులతో మహారాష్ట్ర సతమతమవుతుండగా ముంబై నగరం వ్యాక్సిన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది.  నగరంలో గురువారం బీసీఎం జంబో అనే అనే వ్యాక్సినేషన్  సెంటర్ వద్ద ప్రజలు పెద్దఎత్తున బారులు తీరారు. చాంతా డంత క్యూలలో ఉదయం నుంచే పడిగాపులు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని  నిర్వాహకులు ప్రకటించినప్పటికీ ఎనిమిదిన్నర గంటల వరకు కూడా టీకామందుల  ఊసేలేదు. ఉదయం ఆరున్నర, ఏడు గంటల నుంచే అంతా ఈ సెంటర్ వద్దకు చేరుకున్నారు.  కానీ ఎంతసేపటికీ వ్యాక్సిన్ రాకపోవడంతో వీరిలో అసహనం పెరిగిపోయింది. ఎండలో తాము గంటల కొద్దీ నిలబడుతున్నామని, ఓపిక సన్నగిల్లుతోందని చాలామంది వృద్దులు  వాపోయారు.భౌతిక దూరం అన్నది లేకపోయింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా  ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోప్ అంగీకరించారు. ఇప్పటికే  పలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ టీకామందుల రాకలో జాప్యం జరుగుతోందని అన్నారు. పరిస్థితిని అధిగమించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉత్తర్వులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చునన్నారు. ఇలా ఉండగా దేశంలో కోవిడ్ పాండమిక్ ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కేంద్రాన్ని కోరారు. ఇప్పటివరకు కేంద్రం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. గురువారం  ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమా వేశమై, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై చర్చించారు.

కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో   985 మంది కోవిద్ రోగులు   మరణించారు. మొత్తం మృతుల  సంఖ్య 67,214 కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 78 మంది, థానేలో 92 మంది మృత్యుబాట పట్టారు. ఇలాంటి పరిస్థితిని  తాము ఎన్నడూ ఊహించలేదని అధికారులు  తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Bengal Elections Phase-8 Voting LIVE: బెంగాల్ తుది దశ ఎన్నికలు ప్రశాంతం.. మధ్యాహ్నం 3 గంటల వరకు 68.66 శాతం పోలింగ్

Photo Viral: ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితుడిని చూసి ఆశ్యర్యపోయిన కలెక్టర్‌.. ఆయన చేసిన పనికి ఫిదా.. ఫోటో వైరల్‌