Photo Viral: ఆసుపత్రిలో కోవిడ్ బాధితుడిని చూసి ఆశ్యర్యపోయిన కలెక్టర్.. ఆయన చేసిన పనికి ఫిదా.. ఫోటో వైరల్
Photo Viral: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి దశ కంటే రెండో దశలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు...
Photo Viral: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. మొదటి దశ కంటే రెండో దశలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పాజిటివ్ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. బెడ్స్, ఆక్సిజన్ సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కులాంగే జిల్లాకు చెందిన విజయ్ అనే ఐఏఎస్ అధికారి ఓ కోవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ ఆస్పత్రి బెడ్‌పై ఒక కోవిడ్ బాధితుడు చేసిన పనికి ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆయన ఫోటోను తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం అది తెగ వైరల్ అయ్యింది.
ఒక కోవిడ్ విద్యార్థి ఆస్పత్రి బెడ్‌పై కూర్చుని సీఎ (ఛార్టెడ్ అకౌంటెంట్) పరీక్ష కోసం చదువుతున్నాడు. అతనిలో తనకు కోవిడ్ సోకిందన్న బాధ ఏ మాత్రం కనిపించలేదు. అతని ధ్యాసంతా సీఏ పరీక్ష మీదే ఉంది. ఈ నేపథ్యంలో సదరు బాధితుడి అంకిత భావం పట్ల కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అతనిలో కరోనా సోకిందని ఏ మాత్రం బాధపడకుండా ఆశాభావ దృక్పథంతో ఉన్నాడని కలెక్టర్ అతడిని అభినందించారు. అయితే ప్రజలు కూడా కరోనా సోకిందని భయాందోళన చెందవద్దని, ధైర్యంతో ఉండాలని ఆయన సూచించారు. భయాన్ని వదిలి ధైర్యంగా ఉన్నప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు. కాగా, ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ‘ సీఎ విద్యార్థి అంకిత భావానికి హ్యట్సాఫ్.. మీరు కోవిడ్‌ను గెలుస్తారు.. సీఎ పరీక్షలోనూ విజయం సాధిస్తారని’ కామెంట్లు పెడుతున్నారు.
Success is not coincidence. You need dedication. I visited Covid hospital & found this guy doing study of CA exam. Your dedication makes you forget your pain. After that Success is only formality. pic.twitter.com/vbIqcoAyRH
— Vijay IAS (@Vijaykulange) April 28, 2021