కరోనాతో ఉపాథి కరువు.. నిరుపేదలకు తానా చేయూత.. లక్ష డాలర్ల విలువైన ఆహారపదార్ధాల పంపిణీ..!

చైనాలో పుట్టిన మాయదారి రోగం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తన ప్రతాపాన్ని చేపింది. లాక్ డౌన్ పుణ్యామాని ఎంతోమంది జీవితాలను రోడ్డునపాలు చేసింది.

కరోనాతో ఉపాథి కరువు.. నిరుపేదలకు తానా చేయూత.. లక్ష డాలర్ల విలువైన ఆహారపదార్ధాల పంపిణీ..!

చైనాలో పుట్టిన మాయదారి రోగం ప్రపంచాన్ని చుట్టేసింది. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తన ప్రతాపాన్ని చేపింది. లాక్ డౌన్ పుణ్యామాని ఎంతోమంది జీవితాలను రోడ్డునపాలు చేసింది. కాగా, అమెరికాలో ఈ కోవిడ్‌ వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులపాలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కమ్యూనిటీకి తనవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా).తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ మల్లివేమన ఆధ్వర్యంలో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు 150 ప్రాంతాల్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

కరోనా కారణంగా ఎంతోమంది నిరుపేదలు తిండికోసం కష్టాలు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికే తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లి వేమన చెప్పారు. ఈ సందర్భంగా 1,00,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాలను పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. ఇందుకోసం150 ప్రాంతాల్లో ఈ సహాయం చేసేందుకు ఎంపిక చేశామన్నారు. తానా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్‌ సహాయ కార్యక్రమాలను చేసిందని, ఎంతోమందికి అన్నదానం చేసిందని, అమెరికాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలకు మల్లివేమన ధన్యవాదాలు తెలిపారు.