బీజేపీలోకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు, పశ్చిమబెంగాల్ అర్జున్ సింగ్ కీలక వ్యాఖ్యలు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు.. సౌగతారాయ్ సహా మరో నలుగురు బీజేపీలో చేరబోతున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదు మంది ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వారంతా ఏ సమయంలోనైనా వారు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారాయన. ఆ ఐదు మంది ఎంపీల్లో సౌగతారాయ్ పేరు ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అర్జున్ స్పందిస్తూ..’సౌగతారాయ్ […]
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు.. సౌగతారాయ్ సహా మరో నలుగురు బీజేపీలో చేరబోతున్నారని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదు మంది ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వారంతా ఏ సమయంలోనైనా వారు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారాయన. ఆ ఐదు మంది ఎంపీల్లో సౌగతారాయ్ పేరు ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అర్జున్ స్పందిస్తూ..’సౌగతారాయ్ కెమెరా ముందు సీఎం మమతా బెనర్జీకి మధ్యవర్తిగా కనిపిస్తాడు. కానీ ప్రస్తుతం టీఎంసీపై ఉద్యమం చేస్తున్న అదే పార్టీ నాయకుడు, బెంగాల్ రవాణా మంత్రి సువెందు అధికారితో ఆయన సంప్రదింపులు చేస్తున్నాడు అన్నారు. కావున సౌగతారాయ్ పేరు ఆ జాబితాలో చేర్చుకోవచ్చని చెప్పుకొచ్చారు. ఉత్తర 24పరగణాల జిల్లాలో శనివారం ఓ పూజా కార్యక్రమానికి హాజరైన అనంతరం అర్జున్ సింగ్ ఓ మీడియతో ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. సుబెందు బీజేపీలో చేరితే ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు.