AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ లేఖలో ఉన్నది నిజమే… త‌లైవా క్లారిటీ

Rajinikanth Hints : సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఖండించారు. అయితే అందులో వస్తున్న విషయం మాత్రం నిజమేనని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  2011లో ర‌జనీకాంత్‌ కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డార‌ని, దీని కోసం ఆయ‌న సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నార‌ని లేఖ‌లో ఉంది. ఇక 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నారంటూ కూడా లేఖ‌లో రాసారు. అయితే ఈ వార్త‌లు అన్ని వాస్త‌వాలే అంటూ […]

ఆ లేఖలో ఉన్నది నిజమే... త‌లైవా క్లారిటీ
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 2:26 PM

Share

Rajinikanth Hints : సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఖండించారు. అయితే అందులో వస్తున్న విషయం మాత్రం నిజమేనని పేర్కొంటూ ట్వీట్ చేశారు.  2011లో ర‌జనీకాంత్‌ కిడ్నీ సమస్య తో బాధ‌ప‌డ్డార‌ని, దీని కోసం ఆయ‌న సింగ‌పూర్‌లో వైద్యం చేయించుకున్నార‌ని లేఖ‌లో ఉంది. ఇక 2016లో ఆ స‌మ‌స్య మ‌ళ్ళీ రావ‌డంతో అమెరికా వెళ్లి మార్పిడి చేసుకున్నారంటూ కూడా లేఖ‌లో రాసారు. అయితే ఈ వార్త‌లు అన్ని వాస్త‌వాలే అంటూ త‌లైవా తేల్చి చెప్పారు.

అయితే సోషల్ మీడియాలో తిరుగుతున్న లేఖ మాత్రం తాను రాసింది కాదని అన్నారు. అందులో ఉన్న విషయం మాత్రం నిజమేనని పేర్కొన్నారు. ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్రం స‌భ్యుల‌తో క‌లిసి చ‌ర్చించాక  రాజ‌కీయ పార్టీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తాను అని త‌లైవా పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ర‌జ‌నీకాంత్ పేరుతో లీకైన లెట‌ర్‌లో తన‌కు కిడ్నీ మార్పిడి వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. క‌రోనా స‌మ‌యంలో పార్టీ ప్ర‌క‌టించ‌డం, అంద‌రితో క‌లిసి స‌భ‌లు పెట్ట‌డం ప్రాణాల‌కు రిస్క్‌. అందుకే పార్టీ ప్ర‌క‌ట‌న‌పై ఆలోచిస్తున్నా అంటూ లేఖ‌లో రాసి ఉంది.

Follow Us