నోరూరించే ఇండియన్ డిషెస్, తైవాన్ ప్రెసిడెంట్ ఫిదా !

ఇండియన్ ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ ! తానేకాదు.. తమ దేశ ప్రజలు కూడా భారతీయ ఆహారాన్ని ఎంతో లైక్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా తనకైతే చనా మసాలా, నాన్ అంటే నోరూరిపోతుందట ! ఇక ఇండియన్ టీ అయితే చెప్పనక్కర్లేదు.. ఆ రుచే బ్రహ్మాండం అని పొగిడారు. తైవాన్ లో ఎన్నో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలోని డిషెస్ దేని రుచి దానిదే అన్నారు. ఇందుకు తమ […]

నోరూరించే ఇండియన్ డిషెస్, తైవాన్ ప్రెసిడెంట్ ఫిదా !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 8:23 PM

ఇండియన్ ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ ! తానేకాదు.. తమ దేశ ప్రజలు కూడా భారతీయ ఆహారాన్ని ఎంతో లైక్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా తనకైతే చనా మసాలా, నాన్ అంటే నోరూరిపోతుందట ! ఇక ఇండియన్ టీ అయితే చెప్పనక్కర్లేదు.. ఆ రుచే బ్రహ్మాండం అని పొగిడారు. తైవాన్ లో ఎన్నో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయని, వాటిలోని డిషెస్ దేని రుచి దానిదే అన్నారు. ఇందుకు తమ దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు.మెమొరీస్ ఆఫ్ ఎ వైబ్రెంట్, డైవర్స్ అండ్ కలర్ ఫుల్ కంట్రీ అన్నారామె. మీకు ఇండియన్ డిషెస్ లో ఏది  నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్ కట్టడాన్ని తాను విజిట్ చేసినప్పటి ఫోటోలను ఇంగ్ వెన్ షేర్ చేశారు. నమస్తే ! ఈ దేశ సంస్కృతి, ఇక్కడి ఆచారాలు తనకెంతో నచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎన్నికల్లో ఇంగ్ వెన్ మళ్ళీ ఘనవిజయం సాధించి తైవాన్ ప్రెసిడెంట్ అయ్యారు.,