యుట్యూబ్ లో నెంబర్ వన్ గా ‘టీ-సిరీస్’

యుట్యూబ్ లో తొలిసారిగా భారత యుట్యూబ్ ఛానల్ అగ్రస్థానం దక్కింది. యుట్యూబ్ వేదికగా స్వీడన్ కు చెందిన వ్యూడైపైతో జరుగుతున్న యుద్ధంలో తొలిసారిగా భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనితో యుట్యూబ్ లో ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా అవతరించింది. కాగా ప్రస్తుతం టీ-సిరీస్ కు 90.49 మిలియన్ల మంది ఉండగా.. వ్యూడైపైకు 90.47 మిలియన్లు మాత్రమే ఉన్నారు. దీనితో టీ-సిరీస్ సంస్థ ఏకంగా #BharatWins అనే హ్యాష్ ట్యాగ్ ను […]

  • Ravi Kiran
  • Publish Date - 6:07 pm, Thu, 21 March 19
యుట్యూబ్ లో నెంబర్ వన్ గా ‘టీ-సిరీస్’

యుట్యూబ్ లో తొలిసారిగా భారత యుట్యూబ్ ఛానల్ అగ్రస్థానం దక్కింది. యుట్యూబ్ వేదికగా స్వీడన్ కు చెందిన వ్యూడైపైతో జరుగుతున్న యుద్ధంలో తొలిసారిగా భారత్ కు చెందిన టీ-సిరీస్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దీనితో యుట్యూబ్ లో ఎక్కువమంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా అవతరించింది. కాగా ప్రస్తుతం టీ-సిరీస్ కు 90.49 మిలియన్ల మంది ఉండగా.. వ్యూడైపైకు 90.47 మిలియన్లు మాత్రమే ఉన్నారు.

దీనితో టీ-సిరీస్ సంస్థ ఏకంగా #BharatWins అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా సృష్టించారు. ఇక దీనిలో బాలీవుడ్ సెలెబ్రిటీస్ సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ వంటి వారు కూడా పాల్గొన్నారు. మరోవైపు 2006లో ఛానల్ ప్రారంభించిన టీ-సిరీస్ కు ప్రస్తుతం 29 సబ్ ఛానెల్స్ ఉన్నాయి.