AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 రోజుల్లో రూ.40 వేల కోట్ల ‘ఎఫ్‍పీఐ’ పెట్టుబడులు

విదేశీ పోర్టుఫోలియో మదుపరుల(ఎఫ్‍పీఐ)కు భారత స్టాక్‌ మార్కెట్‌పై మళ్లీ గురి కుదిరింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో, ఈ సంస్థలు నిన్నటి వరకు మన మార్కెట్‌కు ముఖం చాటేశాయి. ఫిబ్రవరి నుంచి సీన్‌ మారిపోయింది. ఇపుడు మళ్లీ ఎడాపెడా కొనుగోళ్లకు దిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థలు భారత మార్కెట్‌లో రూ.40,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి. దీంతో గత నెల రోజుల్లోనే సెన్సెక్స్‌ 3,011 […]

50 రోజుల్లో రూ.40 వేల కోట్ల 'ఎఫ్‍పీఐ' పెట్టుబడులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 21, 2019 | 5:26 PM

Share

విదేశీ పోర్టుఫోలియో మదుపరుల(ఎఫ్‍పీఐ)కు భారత స్టాక్‌ మార్కెట్‌పై మళ్లీ గురి కుదిరింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో, ఈ సంస్థలు నిన్నటి వరకు మన మార్కెట్‌కు ముఖం చాటేశాయి. ఫిబ్రవరి నుంచి సీన్‌ మారిపోయింది. ఇపుడు మళ్లీ ఎడాపెడా కొనుగోళ్లకు దిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థలు భారత మార్కెట్‌లో రూ.40,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి. దీంతో గత నెల రోజుల్లోనే సెన్సెక్స్‌ 3,011 పాయింట్లు (8.5 శాతం), నిఫ్టీ 928 పాయింట్లు (8.75 శాతం) దూసుకుపోయాయి.

గత ఏడాదంతా ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌పై శీతకన్నేశాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు, చమురు సెగ, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణాలు. గత 12 నెలల్లో ఎఫ్‌పీఐలు తొమ్మిది నెలలపాటు భారత స్టాక్‌ మార్కెట్‌లో నికర అమ్మకాలు జరిపాయి. గత ఏడాది ఫిబ్రవరి-ఈ సంవత్సరం జనవరి మధ్య ఈ సంస్థలు రూ.82,652 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరిపారు. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి.

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్