AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: పాత బట్టలను పారేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. మీరు చేసే ఆ చిన్న పొరపాట్లు కష్టాలకు దారి తీస్తాయ్

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చాలా కాలం పాటు వాడకుండా వదిలేసిన ఏ వస్తువైనా ప్రతికూల శక్తిని (నెగటివిటీ) వేగంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా పాతవి, చిరిగినవి లేదా చిన్నగా అయిపోయిన బట్టలను అల్మారాలలో అలాగే దాచి ఉంచడం అత్యంత అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో ప్రతికూలత పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి, ఆందోళన, బద్ధకం పెరిగి చేసే పనులలో అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి. అందువల్ల పాత బట్టలను వదిలించుకునేటప్పుడు వాస్తు నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం.

Vastu Tips: పాత బట్టలను పారేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. మీరు చేసే ఆ చిన్న పొరపాట్లు కష్టాలకు దారి తీస్తాయ్
Old Clothes Vastu Shastra,
Bhavani
|

Updated on: Jun 18, 2026 | 9:25 PM

Share

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడకుండా పక్కన పడేసినవి, పిల్లల సైజులు సరిపోనివి లేదా కొద్దిగా చిరిగిన పాత బట్టలు ఉండటం సర్వసాధారణం. చాలా మంది గృహిణులు అల్మారాలలో స్థలం లేకపోయినా ఈ బట్టలను మూటలుగా కట్టి లోపల పడేస్తుంటారు. మరికొందరు ఆ చిరిగిన బట్టలను ఇల్లు తుడవడానికి, వంటగది క్లీనింగ్ పనులకు వాడుతుంటారు. అయితే, పాత , చిరిగిన బట్టలను ఇంట్లో ఉంచుకోవడంపై వాస్తు శాస్త్రంలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఇంట్లోకి దరిద్రం అడుగుపెడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పాత బట్టలను ఎలా వదిలించుకోవాలి, వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చిరిగిన బట్టల వల్ల కలిగే నష్టాలు వాస్తు శాస్త్రం ప్రకారం, చిరిగిన లేదా పాడైపోయిన దుస్తులను అల్మరా లేదా బీరువాలో నిల్వ ఉంచడం వల్ల ఆ ప్రదేశంలో ప్రతికూల శక్తులు ప్రబలుతాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కుటుంబ సభ్యుల మానసిక స్థితిపై పడుతుంది. దీనివల్ల ఇంట్లో అనవసరమైన మానసిక ఒత్తిడి, నిరంతర ఆందోళనలు రేకెత్తుతాయి. మనుషులలో బద్ధకం పెరిగి, ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేరు. ఉద్యోగ, వ్యాపారాలలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు దక్కవు సరే కదా, అనవసరమైన ఆర్థిక నష్టాలు , ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు వార్డ్‌రోబ్‌ను శుభ్రం చేసుకుని పనికిరాని బట్టలను తొలగించుకోవాలి.

పాత బట్టలతో ఏం చేయాలి? మంచి స్థితిలో ఉంటే దానం చేయండి: మీ వద్ద ఉన్న దుస్తులు పాతవైనప్పటికీ, అవి ఎక్కడా చిరగకుండా ఆకృతి బాగుంటే వాటిని ఇంట్లోనే మూలన పడేయకుండా అవసరంలో ఉన్న పేదలకు లేదా లేనివారికి దానం చేయడం ఉత్తమం. వాస్తు శాస్త్రంలో వస్త్ర దానానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఇది సమాజంలో ఇతరులకు సహాయపడటమే కాకుండా, మీ ఇంట్లో సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) పెరగడానికి అద్భుతంగా దోహదపడుతుంది. అయితే ఇతరులకు ఇచ్చే ముందు ఆ బట్టలను శుభ్రంగా ఉతికి ఇవ్వాలి. మురికిగా ఉన్నవి లేదా చిరిగిన బట్టలను పొరపాటున కూడా దానం చేయకూడదు, అలా ఇస్తే ఎదుటివారిని అవమానించినట్లవుతుంది , దోషం చుట్టుకుంటుంది.

పూర్తిగా చిరిగిపోయిన లేదా దేనికీ పనికిరాని దుస్తులను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. మన దేశంలో చాలా ఇళ్లలో చిరిగిన పాత బనియన్లు, టీషర్టులను ఇల్లు తుడుచుకునే గుడ్డలుగా మార్చడం ఒక అలవాటు. కానీ వాస్తు నియమాల ప్రకారం ఇలా చిరిగిన గుడ్డలతో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి పనికిరాని బట్టలను ఇంట్లో ఉంచకుండా వెంటనే బయట పారవేయడం లేదా కాల్చివేయడం మంచిది.

Follow Us