AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగబట్టిన ఉడుకు రక్కసి.. మొహం చాటేసిన నైరుతి.. ప్రకృతి వికృతిగా మారనుందా..?

12 రాష్ట్రాలపై ఎల్‌నినో పంజా.. ఇదైతే పక్కా. దాదాపు 60 శాతం దేశాన్ని కబళించబోతోంది ఎల్‌నినో రక్కసి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హైఅలర్ట్ ఇది. ఖరీఫ్ సీజన్‌ను మొదట్లోనే తుంచి పడేసేలా, వీలైతే రబీని కూడా డ్యామేజ్ చేసేలా, ఇప్పటికే కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విషాదం ఏంటంటే, ఎల్‌నినో పీడిత 12 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సాగునీటి కోసం రైతాంగం, తాగునీటి కోసం సామాన్య జనాభా అలమటిస్తోంది. ఎల్‌నినో ఎఫెక్ట్ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది.. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై స్టేటస్ ఏంటి? తెలుసుకుందాం..

పగబట్టిన ఉడుకు రక్కసి.. మొహం చాటేసిన నైరుతి.. ప్రకృతి వికృతిగా మారనుందా..?
El Nino Impact On Indian Agricuture
Balaraju Goud
|

Updated on: Jun 18, 2026 | 9:50 PM

Share

ఎల్‌నినోనే కాదు, గతంలో సూపర్‌ ఎల్‌నినోనే ఫేస్ చేసింది మన దేశం. 150 ఏళ్లకిందట ఎల్‌నినో ఎటాక్ చేస్తే, మన దేశంలో వరుసగా రెండేళ్లు రుతుపవనాలు దాదాపుగా లేనేలేవు. వానలు పడక, దాదాపు ఆరుకోట్ల మంది జనం తిండి లేక ఆకలితో అలమటించారు. 11 ఏళ్ల కిందట 2015లో సూపర్ ఎల్‌నినో భారతదేశం మీద పంజా విసిరినప్పటి చేదు జ్ఞాపకం గుర్తుందా? రుతుపవనాలు బలహీనపడి, లోటు వర్షపాతంతో, ఖరీఫ్ పంట దిగుబడి తగ్గిపోయి, దారుణంగా దెబ్బైపోయింది వ్యవసాయరంగం. కాకపోతే, పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై ‘మాడెన్-జూలియన్ ఆసిలేషన్’లో తేడాలొచ్చి, ఒకట్రొండుసార్లు వరుణుడు కరుణించి, ఖరీఫ్ సీజన్‌కి చిన్నపాటి రిలీఫ్ దక్కింది. మిగతా నాలుగు నెలలు దేశమంతా బీడుబారిన నేలలే వెక్కిరించాయి. వరి, పప్పుదినుసులు, వేరుశనగ ధరలు నింగినంటేశాయి. ఆరేడు రాష్ట్రాలు కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్నాయి. వర్షాలను మోసుకొచ్చే మేఘాల్లో తేమను మింగేసే ఆ ఎల్‌నినో వేడిగాలులు, ఇదిగో ఇప్పుడు మళ్లీ భారతదేశంను టార్గెట్ చేసేశాయి. 2015 నాటి కరవు కంటే రెండుమూడింతల ప్రభావం తప్పదు, బీఎలర్ట్ అని హెచ్చరిస్తూనే ఉంది కేంద్రం. గ్రౌండ్ రిపోర్ట్ అయితే, అంతకుమించి అన్నట్టు దారుణంగా ఉంది. ఊరక బెదరగొట్టరు మహానుభావులు. 56 అంగుళాల ఛాతీ కలిగిన ఆజానుబాహుడే నాలుగడుగులు వెనక్కేశారంటే.. దానివెనక ఇంతకుమించి ఏదో అర్థం ఉండే ఉంటుంది. వికసిత్ భారత్‌ వైపు మనం పరుగెత్తుతుంటే, విపత్కర పరిస్థితులు వెనక్కు లాగేస్తున్నాయి.. ఆడంబరాలు తగ్గించుకోండి.. పొదుపు పాటించండి, లేకపోతే...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి