ఘనంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం
ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం బుధవారం కనుల పండువగా జరిగింది. పండితులు ముత్యాలశర్మ, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ మధ్యాహ్నం వేళ ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి(కోనేరు) వరకు తీసుకొచ్చారు. అనంతరం హంస వాహనంపై తెప్పోత్సవం జరిపారు. ఆ తర్వాత యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్య నేతృత్వంలో డోలోత్సవం నిర్వహించారు.