కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానమా? .. అయితే ఈ లక్షణాల గురించి తెలుసుకోండి..
మానవ శరీరంలో ప్రతి భాగం ముఖ్యమే. ఇందులో ఓ ఒక్క టి పనిచేయకపోయిన శరీరం మనకు సహకరించదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కిడ్నీల గురించి.
మానవ శరీరంలో ప్రతి భాగం ముఖ్యమే. ఇందులో ఓ ఒక్క టి పనిచేయకపోయిన శరీరం మనకు సహకరించదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కిడ్నీల గురించి. మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు కిడ్నీలు. చాలా మంది కిడ్నీలు సరిగా పనిచేయక లేవలేని స్థితికి చేరుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ వాటికి సంబంధించిన లక్షణాలను మొదట్లోనే గుర్తించలేకపోతున్నారు. మన శరీరంలో కిడ్నీ సమస్యలు ఉన్నాయేమో అని అనుమానిస్తున్నావారు ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళకుండా కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.
కిడ్నీలు సరిగా పనిచేయడం ఆగిపోతే మనిషికి ఆకలి సరిగా వేయదు. దీంతో శరీరంలో మలినాలు ఉండిపోయి ఆకలి సరిగా వేయదు. అంతేకాకుండా ఊపరితిత్తుల్లో కఫం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. కొంతమందికి కాళ్ళు, చేతులు, ముఖం తరుచు వాస్తున్నాయంటే వారిలో కిడ్నీ లోపం అని గుర్తించవచ్చు. వెన్ను భాగంలో నొప్పి కలుగుతుంది. కిడ్నీలు ఫెయిలైతే వెన్ను నొప్పి ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా తొందరగా శరీరం అలసిపోతుంది. దాంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవే కాకుండా మూత్ర విసర్జనకు వెళ్ళడంలో కూడా సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవడం ఉత్తమం. ఈ లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ చేయకూడదు.