‘సమంత గ్లామర్ హీరోయిన్.. ఆ పాత్రకు సెట్ కాదన్నారు’.. రామలక్ష్మి పాత్రపై సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు.
సమంత రంగస్థలంలో తన పాత్రపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి రంగస్థలంలో మొదట రామలక్ష్మి పాత్ర కోసం సమంతను అనుకున్నప్పుడు చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని వారించారట..
samantha about her role in rangasthalam: పెళ్లి తర్వాత కెరీర్‌లో మరింత వేగం పెంచిన నటి సమంత.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకెళుతోంది. ఇక ఇటీవల ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌తో వ్యాఖ్యాతగా మారింది. ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన సామ్ జామ్ కార్యక్రమంలో సమంత రంగస్థలంలో తన పాత్రపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి రంగస్థలంలో మొదట రామలక్ష్మి పాత్ర కోసం సమంతను అనుకున్నప్పుడు చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్లు వద్దని వారించారట.. సమంత గ్లామర్ హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా ఆమెను ప్రేక్షకులు ఒప్పుకుంటారో లేదో.. సమంత ఈ పాత్రకు సరిపోదు అని సుకుమార్‌తో చెప్పారట. అయితే సుకుమార్ మాత్రం తనపై నమ్మకం ఉంచి ఆ పాత్రను ఇచ్చారని సమంత చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమా సమంతకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం తర్వాత చేసిన ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న సామ్.. తర్వాత మంచి అవకాశాలు పొందడానికి రామలక్ష్మి పాత్ర ఎంతగానో ఉపయోగపడింది.