నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..కోర్టు ఏం చెప్పిందంటే…
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు నేడు విచారించింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు నేడు విచారించింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై ప్రతివాదులకు నోటిసు ఇచ్చింది ధర్మాసనం. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, ఎన్నికల సంఘం పిటిషన్‌తో జత చేసింది. గతంలోనే ఈ విషయంపై విచారణ జరిపామన్న కోర్టు..దీనికి సంబంధించి గతంలో వచ్చిన కేసులతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టివేసింది హైకోర్టు. అలాగే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.