AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడికి మరుగుదొడ్డియే క్వారంటైన్

త‌మిళ‌నాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏండ్ల మాన‌స్ ప‌త్రా త‌న సొంత ఊరు ఒడిశాకు తిరిగి వచ్చాడు. సొంతూరు చేరిన మానస్ కుటుంబాన్ని కాపాడుకోవడానికి బాత్రూంలో క్వారంటైన్ అయ్యాడు.

అతడికి మరుగుదొడ్డియే క్వారంటైన్
Balaraju Goud
|

Updated on: Jun 18, 2020 | 1:54 PM

Share

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదుపేస్తోంది. కొవిడ్ కట్టడిలో భాగంగా జనంతో విన్యాసాలు చేయిస్తోంది. సొంతూరు చేరిన ఓ వ్యక్తి కుటుంబాన్ని కాపాడుకోవడానికి బాత్రూంలో క్వారంటైన్ అయ్యాడు. కరోనా మహమ్మారి ఉద్యోగులు, కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగులు సొంతూర్లకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిని క్వారంటైన్ చేస్తున్నారు స్థానిక అధికారులు. త‌మిళ‌నాడులో ఉద్యోగం చేస్తున్న 28 ఏండ్ల మాన‌స్ ప‌త్రా త‌న సొంత ఊరు ఒడిశాకు తిరిగి వచ్చాడు. స్వరాష్ట్రంలోకి రాగానే వారం రోజుల పాటు క్వారెంటైన్‌‌లో ఉంచారు అధికారులు. సుదుకాంతి పాఠ‌శాల‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరానికి మానస్ ను పంపించారు. క‌రోనా ల‌క్ష‌ణాలేమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏడు రోజుల‌కే డిశ్చార్జ్ చేశారు. ఆ త‌ర్వాత హోమ్ క్వారెంటైన్ మ‌రో వారం రోజులపాటు ఉండాల‌ని సూచించారు. అయితు ఆరుగురు కుటుంబ స‌భ్యులున్న త‌న ఇంట్లో త‌గినంత స్ఠ‌లం లేదు. టిఎంసిలో త‌న బ‌స‌ను పొడిగించాల‌ని మాన‌స్ ప‌త్రా కోరాడు. పొడిగింపుకు అధికారులు అనుమ‌తి లేదు. ఇంట్లో మ‌రొక గ‌ది లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యుల భ‌ద్ర‌త కోసం.. కొత్తగా నిర్మించుకున్న టాయిలెట్‌నే క్వారంటైన్ గా మార్చుకున్నాడు. మరుగుదొడ్డిలోనే జూన్ 9 నుండి 15 వరకు ఏడు రోజులపాటు గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు మానస్ ప‌త్రా.

Follow Us
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
మాతృత్వపు అనుభూతి అద్భుతం..నెటిజన్లతో ముచ్చటించిన సమంత!
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
జీతం పెరిగినా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరగటం లేదా..?
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
మెయిడెన్ ఓవర్‌తో 3 వికెట్లు.. 19 ఏళ్ల స్పిన్నర్‌ సంచలనం..!
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
కా.. కా.. అరుపుల వెనుక ఇంత కథ ఉందా.. కాకుల భాషా రహస్యాలు..
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..