ఎంట్రెన్స్ పరీక్షలు రద్దు.. డీమ్డ్ వర్సిటీలకు డిమాండ్..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా
Students more interested to study in Deemed Universities: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు చాలా పరీక్షలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఎదురు చూడకుండా పలువురు నగర విద్యార్థులు ప్రైవేట్ వర్సిటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అత్యుత్తమ బోధన, ల్యాబ్ సదుపాయాలు, ప్రాక్టికల్‌గా ఆయా సబ్జెక్టులను బోధించే ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం కరోనా కారణంగా ఎంట్రెన్స్ పరీక్షలను రద్దు చేశాయి. దీంతో ప్రధానంగా ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మా, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల విషయంలో మెజార్టీ విద్యార్థులు ప్రైవేటు వర్సిటీల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నట్లు విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. అక్కడ విద్యాబోధన అనంతరం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం దక్కించుకునే అవకాశాలుండటంతో ఆయా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారంటున్నారు.