యూట్యూబ్ ఛానల్ పెట్ట‌బోతున్న స్టార్ హీరోయిన్‌..

క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా కాకుండానే త‌న‌కంటూ సినీ ఇండ‌స్ట్రీలో పేరు సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శృతి హా స‌న్‌. మొద‌టిలో టెక్నిక‌ల్ యూనిట్‌తో క‌లిసి ప‌ని చేసిన శృతి ఆ త‌రువాత హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా త‌న కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే..

యూట్యూబ్ ఛానల్ పెట్ట‌బోతున్న స్టార్ హీరోయిన్‌..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 11:10 AM

క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా కాకుండానే త‌న‌కంటూ సినీ ఇండ‌స్ట్రీలో పేరు సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శృతి హా స‌న్‌. మొద‌టిలో టెక్నిక‌ల్ యూనిట్‌తో క‌లిసి ప‌ని చేసిన శృతి ఆ త‌రువాత హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా త‌న కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే.. తెలుగు, త‌మిళంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది శృతి. అయితే వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే స‌డ‌న్ బ్రేక్ ఇచ్చి ఇండ‌స్ట్రీకి దూర‌మైన ఈ భామ‌.. ఇటీవ‌లే మాస్ మ‌హారాజ‌ ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ సినిమా చేస్తుంది. కాగా శృతి కేవ‌లం న‌టిగానే కాకుండా సింగ‌ర్‌, కంపోజ‌ర్‌గా కూడా సుప‌రిచిత‌మే.

ఈ మ‌ధ్య వ‌ర‌కూ శృతి హాస‌న్ యూకేలో చాలా మ్యూజిక‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది. అయితే త‌న మ్యూజిక్ టూర్ల‌ను ఇండియ‌న్స్ మిస్ అవుతూండ‌టంతో.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ‌ధ్యే ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా సోష‌ల్ మీడియాలో సంభాషించిన శృతి.. త్వ‌ర‌లోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. యూట్యూబ్ ద్వారా ఫ్యాన్స్‌కి మ‌రింత ద‌గ్గ‌ర అవ్వాల‌ని ఆలోచిస్తున్నా అంటూ తెలిపింది. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో అన్నీ సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్‌తో పాటు నా ప్ర‌ద‌ర్శ‌న‌లు.. మ్యూజిక‌ల్ టూర్ల‌కు సంబంధించిన అన్ని వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తాన‌ని చెప్పుకొచ్చింది శృతి.