అమెరికాలో టిక్ టాక్ నిషేధానికి బిల్లు.. ఆమోదం

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ని అమెరికాలో దాదాపు నిషేధించినట్టే ! ఫెడరల్ ఉద్యోగులు తమ ఫోన్లు, ఇతర సాధనాల్లో ఈ యాప్ ని వినియోగించకుండా బ్యాన్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించింది. యూజర్ల పర్సనల్ డేటా..

అమెరికాలో టిక్ టాక్ నిషేధానికి బిల్లు.. ఆమోదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 23, 2020 | 11:05 AM

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ని అమెరికాలో దాదాపు నిషేధించినట్టే ! ఫెడరల్ ఉద్యోగులు తమ ఫోన్లు, ఇతర సాధనాల్లో ఈ యాప్ ని వినియోగించకుండా బ్యాన్ చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం యుఎస్ సెనేట్ కమిటీ ఆమోదించింది. యూజర్ల పర్సనల్ డేటా చై నా చేతుల్లోకి వెళ్లిపోతుందన్న భయంతో దీనికి స్వస్తి చెప్పారు. ‘నో టిక్ టాక్ ఆన్ గవర్నమెంట్ డివైజెస్ యాక్ట్’ అన్న  పేరిట జోష్ హాలే అనే సెనెటర్ ప్రవేశపెట్టిన బిల్లును ఈ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక యూఎస్  సెనేట్ లో దీనిపై ఓటింగ్ జరగనుంది. అమెరికాలో ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ళ మధ్యవయసున్న యువత ఎక్కువగా టిక్ టాక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దేశ జనాభాలో వీరు 60 శాతం వరకు ఉన్నారు. ఫెడరల్ సిబ్బంది ఈ యాప్ వాడరాదని ఇటీవలే ప్రతినిధుల సభ బిల్లును ప్రవేశపెట్టగా 336 మంది అనుకూలంగాను, 71 మంది వ్యతిరేకంగాను ఓటు చేశారు. ప్రతినిధుల సభలోను, సెనేట్ లోను ఈ బిల్లులు ఆమోదం పొందడంతో త్వరలో దేశంలో ఇది చట్టం కావచ్చు.