అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయ నిర్మాణం
అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న సంగతి తెలిసిందే. గుడి ఒరిజినల్ డిజైన్ ని 141 అడుగుల ఎత్తయినదిగా 1988 లో నిర్దేశించారని, కానీ ఈ సారి దీన్ని..
అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న సంగతి తెలిసిందే. గుడి ఒరిజినల్ డిజైన్ ని 141 అడుగుల ఎత్తయినదిగా 1988 లో నిర్దేశించారని, కానీ ఈ సారి దీన్ని మరో 20 అడుగులు పెంచి నిర్మించనున్నామని ఆర్కిటెక్టులు తెలిపారు. ఇదివరకటి డిజైన్ ఆధారంగా స్తంభాలు, రాళ్లను చెక్కుతామన్నారు. ఆలయ నిర్మాణం మూడు నుంచి ఐదేళ్లు పట్టవచ్చు.. ఆగస్టు మూడో తేదీ నుంచి మూడు రోజులపాటు హోమాలు జరుగుతాయి. శంకుస్థాపన రోజున ప్రధాని మోదీ 40 కేజీల బరువైన వెండి ఇటుకను సంబంధిత స్థలంలో ఉంచడంతో భూమిపూజ మొదలవుతుంది. ఆలయ నిర్మాణంలో అదనంగా మరో రెండు మండపాలను కూడా నిర్మించనున్నారు.