పాడిపశువులకు కరోనా భయం..! రైతు వినూత్న ఆలోచన
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మనుషులనే కాదు...మూగజీవాలను సైతం వణికిస్తోంది. నగరాలు, పట్టణాలే కాదు ఇప్పుడు గ్రామాలకూ వైరస్ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో పాడిగేదెలు ఉన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మనుషులనే కాదు…మూగజీవాలను సైతం వణికిస్తోంది. నగరాలు, పట్టణాలే కాదు ఇప్పుడు గ్రామాలకూ వైరస్ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో పాడిగేదెలు ఉన్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మూగజీవాలకు కరోనా సోకకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఓ రైతు చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు వైరల్‌గా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన అన్నవరం అనే రైతుకు పంట పొలాలతో పాటు గేదెలు కూడా ఉన్నాయి. పాలతో తమ కుటుంబాన్ని పోషిస్తున్న గేదెలంటే ఆ రైతుకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న వైరస్ తన పశువులకు ఎక్కడో సోకుతుందోననే భయంతో వినూత్నంగా ఆలోచించాడు. పశువులకు మాస్కులు కట్టి పొలం తీసుకెళ్తున్నాడు. గడ్డి మేసేటప్పుడు…కుడితి, నీళ్లు తాగేటప్పుడు మాత్రమే మాస్కు తొలగిస్తున్నాడు. మిగతా సమయమంతా మాస్క్‌లు ఉండేలా చూస్తున్నాడు. పాలిచ్చే గేదెలను కాపాడుకోవడం తన కర్తవ్యమంటున్నాడు. అంతేకాదు రైతు అన్నవరం ఆతృత చూసి..మిగతా రైతులు కూడా అదే ఫాలో అవుతున్నారట.