మీసాలు, గడ్డాలు తీసేసి కొత్త లుక్‌లో షాకిస్తున్న చిరు.. కారణం అదేనా?
మేకోవర్స్ మూడ్ అంటూ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ లుక్ చూసిన అభిమానులు, ఫ్యాన్స్ షాక్‌కి గురవుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. మీసాలు, గడ్డాలు తీసేసి క్లీన్ షేవ్ చేసుకున్నారు చిరు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా స్వయంగా..
మేకోవర్స్ మూడ్ అంటూ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ లుక్ చూసిన అభిమానులు, ఫ్యాన్స్ షాక్‌కి గురవుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. మీసాలు, గడ్డాలు తీసేసి క్లీన్ షేవ్ చేసుకున్నారు చిరు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా స్వయంగా ఆయనే ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కాగా బ్లఫ్ మాస్టర్ డైరెక్టర్ గోపీ గణేష్ ఫొటో పోస్ట్ చేయడంతో.. రీసెంట్‌గా తన లుక్ కూడా రివీల్ చేశారు చిరు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో ఈ ఫొటో షేర్ చేశారు చిరంజీవి. మేకోవర్స్ మూడ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే ఈ లుక్ ఆచార్య సినిమా కోసం కాదంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. సరదగా ఈ న్యూ లుక్ ట్రై చేసినట్టు వెల్లడించారు చిరు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More: