షిర్డీ సాయిబాబా దర్శన భాగ్యం ఎప్పుడంటే?
అన్‌లాక్ - 2 తర్వాత దేశంలో ఎన్నో ఆలయాలు తెరుచుకున్నాయి. అలాగే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలోకి కూడా భక్తులను తక్కువ సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ప్రముఖ క్షేత్రం శ్రీ షిర్డీ సాయిబాబు ఆలయంలో మాత్రం..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయాయి. రోజురోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. అటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే దేశంలో అత్యధిక కోవిడ్ కేసులతో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. దీంతో ఆ రాష్ట్ర వ్యప్తంగా పలు నిబంధనలు అమలు పరుస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే పలు ఆలయాల్లో భక్తుల దర్మనాలకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.
కాగా అన్‌లాక్ – 2 తర్వాత దేశంలో ఎన్నో ఆలయాలు తెరుచుకున్నాయి. అలాగే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలోకి కూడా భక్తులను తక్కువ సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకూ ప్రముఖ క్షేత్రం శ్రీ షిర్డీ సాయిబాబు ఆలయంలో మాత్రం దర్శనాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు మహారాష్ట్ర ప్రభుత్వం.
అయితే ఇతర రాష్ట్రాల్లో ఆలయాలు ఇప్పటికే తెరుచుకున్నందున.. ఇక్కడ కూడా అనుమతివ్వాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌తో పాటు స్థానికులు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈవో అరుణ్ డోంగ్రీ.. మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నెల లేదా రెండు నెలల్లో ఆలయం తెరుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆలయం తెరవడానికి పర్మిషన్ ఇచ్చిన వెంటనే సాయి బాబా దర్శనానికి భక్తులను అనుమతిస్తామని సంస్థాన్ సీఈవో అరుణ్ డోంగ్రీ పేర్కొన్నారు.
Read More: హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం..