సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల.. సీఎం కేసీఆర్ ఆదేశం..
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను ఆయన కోరారు. సీఎం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఆగస్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్లశాఖ దాదాపు 100 మందికి పైగా ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిన సంగతి విదితమే.
Also Read: ఎంట్రెన్స్ పరీక్షలు రద్దు.. డీమ్డ్ వర్సిటీలకు డిమాండ్..