వచ్ఛే ఏడాది జనవరి తరువాతే కోవిడ్ -19 వ్యాక్సీన్…ప్రపంచ ఆరోగ్య సంస్థ
కోవిడ్-19 తొలి వ్యాక్సీన్ వచ్ఛే ఏడాది జనవరి లోగా వచ్ఛే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ లోగా ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయాల్సి ఉందని పేర్కొంది. వివిధ దేశాల్లోని రీసెర్చర్లు వ్యాక్సీన్లను తయారు చేయడంలో పురోగతి..
కోవిడ్-19 తొలి వ్యాక్సీన్ వచ్ఛే ఏడాది జనవరి లోగా వచ్ఛే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ లోగా ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయాల్సి ఉందని పేర్కొంది. వివిధ దేశాల్లోని రీసెర్చర్లు వ్యాక్సీన్లను తయారు చేయడంలో పురోగతి సాధిస్తున్నారని, ఇది చెప్పుకోదగిన విషయమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లోని అత్యవసర సర్వీసుల విభాగం హెడ్ మైక్ ర్యాన్ చెప్పారు. ఏమైనా వీటి మొదటి వినియోగం 2021 జనవరి వరకు రాజాలదని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అనేక వ్యాక్సీన్లు మూడో దశ పరీక్షల్లో ఉన్నాయని, ఇప్పటివరకు ఏవీ విఫలం కాలేదని ర్యాన్ అన్నారు. వ్యాక్సీన్ల ఉత్పత్తిని పెంచడంలో తమ సంస్థ వివిధ దేశాలకు సహాయపడుతున్నట్టు తెలిపారు. ధనిక, పేద తేడా లేకుండా ఇవి ప్రతివారికీ ఉపయుక్తమే అని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రికార్డు దశకు చేరువలో ఉన్నాయని ర్యాన్ వెల్లడించారు. పరిశోధకుల నిర్విరామ కృషి సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.