కృష్ణా జిల్లాకు స్పెషల్ అవార్డు.. 3 లక్షల నగదు బహుమానం.. వారిని ఆదుకున్నందుకేనన్న కలెక్టర్

కోవిడ్ లాక్ డౌన్ కాలంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికిగాను కృష్ణా జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక అవార్డు దక్కింది. కలెక్టర్ స్వయంగా ఈ అవార్డును స్వీకరించేందుకు న్యూఢిల్లీకి వెళుతున్నారు.

కృష్ణా జిల్లాకు స్పెషల్ అవార్డు.. 3 లక్షల నగదు బహుమానం.. వారిని ఆదుకున్నందుకేనన్న కలెక్టర్
Follow us

|

Updated on: Nov 19, 2020 | 5:29 PM

Special award for Krishna district: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు ప్రత్యేక అవార్డు వచ్చింది. అందుకు గాను మూడు లక్షల రూపాయల నగదు బహుమానం కూడా దక్కిందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కేంద్ర మత్స్య శాఖా మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డును నవంబర్ 21వ తేదీన న్యూఢిల్లీలో స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

‘‘ కృష్ణాజిల్లాకు బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ అవార్డ్ రావడం గర్వకారణం.. 3 లక్షల నగదు బహుమతి కూడా‌ అందచేస్తున్నారు.. కరోనా సమయంలొ ఆక్వా రైతులకు అందించిన సహకారంతోనే అవార్డుకు ఎంపికయ్యాం.. కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్రం తీర ప్రాంతం ఉంది.. కోవిడ్ సమయంలో అక్వా రైతులకు తమ ఉత్పత్తులను సరఫరా చేసుకొనేందుకు 4 వేల పాస్‌లు అందచేశాం.. లక్షా ‌50 వేల ఎకరాల సమాచారాన్ని ఈ-క్రాప్‌లో పెట్టాం.. కేంద్ర ఫిషరీస్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు ప్రధానం ఎల్లుండి (నవంబర్ 21వ తేదీన) న్యూఢిల్లీలో జరగనుంది..’’ అని హర్షాతిరేకాల మధ్య వివరించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ పలు రంగాలను ప్రభావితం చేసినట్లు ఆక్వా రంగాన్ని కూడా స్థంభింప చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రంగం ఇంపార్టెన్స్… ఆ రంగం మీద ఆధారపడి బతుకున్న ప్రజల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆక్వా ఉత్పత్తుల రవాణా కోసం ఏపీ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్లనే ప్రస్తుతం జిల్లాకు ఈ అవార్డు వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

ALSO READ: కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా రిజర్వేషన్

ALSO READ: గ్రేటర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదే..

ALSO READ: లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో