గ్రేటర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదే.. స్లిప్పులు కూడా ఇవ్వొద్దు.. వార్నింగిచ్చిన ఈసీ

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు గురువారం ప్రవర్తనా నియమావళిని వెలువరించింది.

  • Rajesh Sharma
  • Publish Date - 4:08 pm, Thu, 19 November 20

GHMC elections code of conduct: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే పలు మార్పులకు ఈసీ శ్రీకారం చుట్టింది. ఈసీనే స్వయంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తున్నందున పార్టీలు పోలింగ్ స్టేషన్ల దగ్గర స్లిప్పుల పంపిణీ చేపట్ట వద్దని ఈసీ ఆదేశించింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు:

# గోడలమీద రాతలు, పోస్టర్లు, పేపర్లు అంటించుట, లేక మరే ఇతర విధంగా కానీ ప్రభుత్వ ఆవరణలను (భవనాలు మొదలైన కట్టడాలు) పాడు చేయుట నిషేధం.

# పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథిన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్ల వాడకం నివారించేందుకు ప్రయత్నించాలి.

# ఎన్నికల కరపత్రం లేక పోస్టరుపై ఆ ప్రింటరు మరియు పబ్లిషరు పేర్లు, చిరునామాలు లేకుండా ముద్రించరాదు. లేక ప్రచురించరాదు.

# ప్రత్యేక ఉపకరణాలు ధరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వాటికి అయ్యే ఖర్చు మాత్రం అభ్యర్థి ఎన్నికల వ్యయ పట్టికలో నమోదు చేయాలి.

# ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుండి, అభ్యర్థి తన ఎన్నికల నిమిత్తం ప్రజలకు, సినిమాటోగ్రఫి, టెలివిజన్ లేదా ఇతర తత్సమాన ప్రచార సాధనాలు వినియోగించుట నిషేధం.

# లౌడ్ స్పీకర్లు వాడడానికి సంబంధిత పోలీసు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి.

# బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనలలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య మరియు ఇతర సంందర్భాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించబడతాయి.

# పబ్లిక్ సమావేశాలు రాత్రి 10 గంటల దాటిన తరువాత మరియు ఉదయం 6 గంటల కన్నా ముందు నిర్వహించరాదు. ఎన్నికల పోలింగ్ ముగిసే సమాయానికి 48 గంటల ముందు నుండి పోలింగ్ ముగిసే వరకు ఎటువంటి పబ్లిక్ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు.

# అధికారిక యంత్రాంగం ద్వారా ఓటర్లకు అధికారిక ఫోటో గుర్తింపు స్లిప్ జారీ చేయబడుచున్నందున, అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వకూడదు.

ALSO READ: లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో