కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా.. వారి పిల్లలకు వైద్య విద్యలో రిజర్వేషన్ : నిర్ణయించిన కేంద్రం

దేశంలో కోవిడ్ నివారణకు ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ పోరాడుతున్న కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ ట్రీట్‌మెంటులో ప్రాణాలొదిలిన వారి పిల్లలకు వైద్య విద్య అడ్మిషన్లలో ప్రత్యేక కోటా ఇవ్వాలని తీర్మానించారు.

కోవిడ్ వారియర్లకు ప్రత్యేక కోటా.. వారి పిల్లలకు వైద్య విద్యలో రిజర్వేషన్ : నిర్ణయించిన కేంద్రం
Follow us

|

Updated on: Nov 19, 2020 | 4:46 PM

Special recognition for Covid warriors: గత ఎనిమిది నెలలుగా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడుతున్న కోవిడ్ వారియర్లకు (డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు) కేంద్ర ప్రభుత్వం అత్యంత శుభవార్త వినిపించింది. వైద్య విద్యలో కోవిడ్ వారియర్స్ పిల్లలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే ఇది వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

2020-21 విద్యా సంవత్సరానికి వైద్య విద్య అడ్మిషన్లలో కొత్త కోటా ఏర్పాటు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ వారియర్ల పిల్లల కోసం వైద్య విద్యలో ప్రత్యేక కోటా సృష్టించింది. సెంట్రల్ పూల్ నుంచి ఈ ప్రత్యేక కోటాను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ కష్టకాలంలో సేవలందిస్తూ మరణించినవారి పిల్లలకు ఈ ప్రత్యేక కోటా వర్తిస్తుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు. నీట్ ర్యాంక్ ఆధారంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా విద్యార్థులకు వైద్య విద్య సీట్లను కేటాయిస్తారు.

ALSO READ: గ్రేటర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇదే..

ALSO READ: లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో