లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా.. సర్కార్ దుకాణాల అద్దెలో మిగులు

ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం సరికొత్త సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా లిక్కర్ బిజినెస్‌లోను రివర్స్ టెండరింగ్ విధానం ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసిందని...

లిక్కర్ దందాలోను రివర్స్ టెండరింగ్.. రూ.108 కోట్లు ఆదా.. సర్కార్ దుకాణాల అద్దెలో మిగులు
Follow us

|

Updated on: Nov 19, 2020 | 2:50 PM

Reverse tendering in Liquor business: ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానం సరికొత్త సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా లిక్కర్ బిజినెస్‌లోను రివర్స్ టెండరింగ్ విధానం ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఏకంగా 108 కోట్ల రూపాయలను లిక్కర్ దందాలో ప్రభుత్వం ఆదా చేసిందని ఆయన గురువారం వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ బిజినెస్‌లోను రివర్స్ టెండరింగ్ సిస్టమ్ ఫాలో అయ్యామని ఆయన తెలిపారు.

ఏపీలోని కొన్ని ఏరియాల్లో అధిక మొత్తాలకు టెండర్లు వేసి మద్యం దుకాణాలను పొంది.. ఆ తర్వాత యధేచ్ఛగా మద్యం ధరలను పెంచి మందు ప్రియుల జేబుల కొల్లగొడుతున్న వారికి చెక్ పెట్టేందుకు కొన్ని మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మద్య దుకాణాలకు అద్దెకు తీసుకున్న మడిగలకు గత ఆర్థిక సంవత్సరం (2019-2020) రూ. 671.04 కోట్ల అద్దెను ప్రభుత్వం చెల్లించింది. అయితే, ఈ షాపుల ఎంపికలోను రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. దాంతో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను.. మద్యం దుకాణాల రెంట్ పై 108 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని నారాయణ స్వామి వివరించారు.

‘‘ సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేదం చేస్తున్నాం.. గతంలో మద్యం షాపులు రెంటుకు తీసుకున్నాం.. అధిక రెంట్లకు షాపులు తీసుకున్నారని సీఎం జగన్ దృష్టిలో పెట్టా.. దాంతో ఆయన రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. దాంతో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.108.84 కోట్లు ఆదా అయ్యింది.. 2019-20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించాం.. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21కి కేవలం 562.2 కోట్ల రూపాయిలు చెల్లిస్తున్నాం.. దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశాం.. ’’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు.

ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన

ALSO READ: మంత్రి పేర్నినాని ఇంట్లో విషాదం.. పలువురి సంతాపం

ALSO READ: కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో