ఇండోర్ బంగారం షాపులో కరోనా కలకలం.. 31 మంది సిబ్బందికి కొవిడ్ పాజిటివ్.. కస్టమర్ల కోసం ట్రేసింగ్..!

దేశ వ్యాప్తంగా రెండో దఫా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎంత చెప్పిన జనంలో మార్పు రావడంలేదు.

ఇండోర్ బంగారం షాపులో కరోనా కలకలం.. 31 మంది సిబ్బందికి కొవిడ్ పాజిటివ్.. కస్టమర్ల కోసం ట్రేసింగ్..!
Follow us

|

Updated on: Nov 19, 2020 | 2:31 PM

దేశ వ్యాప్తంగా రెండో దఫా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎంత చెప్పిన జనంలో మార్పు రావడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరంతో పాటు, మాస్కులు తప్పనిసరి అని చూపిస్తున్నప్పటికీ యథావిధిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా మహమ్మారి ధాటికి గురవుతున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రంలో ఉన్న ఓ జ్యువెల‌రీ షాపులో 31 మందికి క‌రోనా వైర‌స్ సోకిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఇండ్ మున్సిప్ కార్పోరేషన్ అధికారులు న‌గ‌రంలో అప్ర‌మ‌త్త‌త ప్ర‌క‌టించారు. తాత్కాలికంగా ఆనంద్ జ్యువెల‌రీ షాపును మూసి .. డిస్ఇన్‌ఫెక్ష‌న్ చేస్తున్నారు. అయితే, ఈ స్టోర్‌ను గ‌త వారం రోజుల నుంచి విజిట్ చేసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ షాపులోకి వచ్చిన కస్టమర్లు ముందు జాగ్రత్తగా హోంఐసోలేట్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. వైర‌స్ సంక్ర‌మించిన ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల గురించి ట్రేసింగ్ ప్రారంభించామ‌ని, వారిలో ఎవ‌రికైనా ద‌గ్గు, జ‌లుబు లాంటి ల‌క్ష‌ణాలు ఉంటే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ జాదియా తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1.86 ల‌క్ష‌ల మంది కరోనా వైర‌స్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో సుమారు 1,200 మంది వైరస్ కాటుకు బలయ్యారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు