కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ షో షూటింగ్‌కు బ్రేక్!
ఎంత స్టార్ హీరోలైనా.. ఎన్ని స్వీయ నిబంధనలు విధించుకుని కరోనా వైరస్ సోకకుండా వుండాలనుకుంటే కుదిరేలా లేదు. తమ వ్యక్తిగత సిబ్బంది తమలా...
Bollywood hero into self isolation: ఎంత స్టార్ హీరోలైనా.. ఎన్ని స్వీయ నిబంధనలు విధించుకుని కరోనా వైరస్ సోకకుండా వుండాలనుకుంటే కుదిరేలా లేదు. తమ వ్యక్తిగత సిబ్బంది తమలా కఠినంగా వుండాలన్న గ్యారంటీ ఏమీ లేదు. సరిగ్గా ఇదే పరిస్థితి ఓ బాలీవుడ్ స్టార్ హీరోకు ఎదురైంది. లాక్‌డౌన్ డేస్‌లో పూర్తిగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమై.. అన్ లాక్‌డౌన్ మొదలయ్యాక కూడా చాలా కాలం ఇంటికే పరిమితమైన ఈ బాలీవుడ్ స్టార్ హీరో.. ఇపుడు తన వ్యక్తిగత డ్రైవర్ కారణంగా సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది.
తన కారు డ్రైవర్‌తోపాటు వ్యక్తిగత సిబ్బందిలోని ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ స్వీయ నిర్బంధం (సెల్ఫ్ ఐసొలేషన్)లోకి వెళ్లారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సదరు సిబ్బందిని చికిత్స నిమిత్తం ముంబయిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు.
అన్ లాక్‌డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా సినిమా, టీవీ షోస్ షూటింగులు ప్రారంభం కావడంతో సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. మరోవైపు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ సల్మాన్ ఖాన్ పలు సందర్భాల్లో వీడియోలు షేర్ చేసి, ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ: మరోసారి రాష్ట్ర విభజన.. కేంద్రం ముందు తాజా ప్రతిపాదన