నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు వర్షసూచన

రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అమరావతి  వాతావరణ కేంద్రం తెలిపింది.

నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు వర్షసూచన
Follow us

|

Updated on: Oct 25, 2020 | 6:27 PM

రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అమరావతి  వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 2 రోజులలో మొత్తం దేశం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది. మరోవైపు నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈ రోజ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం వివరించింది.

Also Read :

యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ