యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్  ఆస్పత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే.

యాంజియోప్లాస్టీ సక్సెస్.. కపిల్ డిశ్చార్జ్‌
Follow us

|

Updated on: Oct 25, 2020 | 4:10 PM

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్  ఆస్పత్రిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం కపిల్ ప్రమాదం నుంచి బయటపడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో..ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్‌ చేసినట్లు మాజీ క్రికెటర్‌ చెతన్‌శర్మ ఆదివారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు.

ఆస్పత్రి వైద్యుడితో కపిల్ దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘డాక్టర్ అతుల్ మాథుర్ కపిల్ పాజీకి యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం కపిల్‌ కోలుకోవడంతో ఈ రోజు ఉదయం ఆయనను డిశ్చార్జ్‌ చేశారు’ అంటూ చేతన్‌ శర్మ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Latest Articles